BECIL Recruitment: దేశవ్యాప్తంగా 1100 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే

BECIL Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 24 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీడీతో పాటు దరఖాస్తు ఫామ్‌కు విద్యార్హత, ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు, రెండు ఫోటోలు, ఆధార్, పాన్ కార్డు జిరాక్సులు జతచేయాలి.

news18-telugu
Updated: June 23, 2019, 9:36 AM IST
BECIL Recruitment: దేశవ్యాప్తంగా 1100 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే
BECIL Recruitment: దేశవ్యాప్తంగా 1100 ఖాళీలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
నిరుద్యోగులకు శుభవార్త. తక్కువ చదివినా మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? మొత్తం 1100 ఉద్యోగాల భర్తీకి బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నోటిఫికేషన్ జారీ చేసింది. స్కిల్డ్, అన్-స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్ట్స్ పేరుతో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో స్కిల్డ్ పోస్టులు 400, అన్‌స్కిల్డ్ 700 పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 24 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీడీతో పాటు దరఖాస్తు ఫామ్‌కు విద్యార్హత, ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్లు, రెండు ఫోటోలు, ఆధార్, పాన్ కార్డు జిరాక్సులు జతచేయాలి. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే



మొత్తం ఖాళీలు- 1100
స్కిల్డ్ పోస్టులు- 400
అన్‌స్కిల్డ్ పోస్టులు- 700
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూన్ 24
విద్యార్హత: స్కిల్డ్ అభ్యర్థులు ఎలక్ట్రికల్‌లో ఐటీఐ, వైర్‌మెన్ లేదా ఎలక్ట్రికల్‌లో డిప్లొమా పూర్తి చేయడంతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. అన్-స్కిల్డ్ అభ్యర్థులు కనీసం 8వ తరగతి పాస్ కావాలి. ఏడాది అనుభవం ఉండాలి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంతో ఉండాలి.వేతనం: స్కిల్డ్ ఉద్యోగులకు రూ.9,381.06, అన్-స్కిల్డ్ ఉద్యోగులకు రూ.7,613.42.
వయస్సు: స్కిల్డ్ ఉద్యోగులకు 45 ఏళ్లలోపు. అన్‌-స్కిల్డ్ అభ్యర్థులకు 55 ఏళ్లలోపు.
ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.250.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్ ఇదే.
Shri Awadhesh Pandit,
Dy. General Manager (F&A),
Broadcast Engineering Consultants India Limited,
BECIL Bhawan,
C-56/A-17, Sector-62,
Noida- 201307,
Uttar Pradesh.

Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... టెన్త్‌తో పాటు అనుభవం తప్పనిసరి

Railway Jobs: డిగ్రీ ఉందా? ఎంఎస్ ఆఫీస్ వచ్చా? రైల్వేలో 95 ఉద్యోగాలు...

SSC MTS Jobs: 10,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్... సిలబస్ ఇదే
Published by: Santhosh Kumar S
First published: June 23, 2019, 9:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading