హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BDL Recruitment 2021: బీడీఎల్‌లో ఉద్యోగాలు... హైదరాబాద్, విశాఖపట్నంలో ఖాళీలు

BDL Recruitment 2021: బీడీఎల్‌లో ఉద్యోగాలు... హైదరాబాద్, విశాఖపట్నంలో ఖాళీలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

BDL Recruitment 2021 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL హైదరాబాద్, విశాఖపట్నం, సంగారెడ్డిలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర రక్షణ శాఖకు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 70 ఖాళీలున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, విశాఖపట్నంలో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి ఏడాది గడువు ఉన్న పోస్టులు మాత్రమే. ప్రాజెక్ట్ అవసరాలను బట్టి గడువును నాలుగేళ్లకు పొడిగిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bdl-india.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే అభ్యర్థులు hrcorp-careers@bdl-india.in మెయిల్ ఐడీలో సంప్రదించొచ్చు.

  BDL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు- 70

  ప్రాజెక్ట్ ఇంజనీర్- 55

  ప్రాజెక్ట్ ఇంజనీర్ (మెకానికల్)- 24

  ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)- 22

  ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 1

  ప్రాజెక్ట్ ఇంజనీర్ (కంప్యూటర్స్)- 1

  ప్రాజెక్ట్ ఇంజనీర్ (సివిల్)- 3

  ప్రాజెక్ట్ ఇంజనీర్ (SAP ERP / Network)- 4

  ప్రాజెక్ట్ ఆఫీసర్- 15

  ప్రాజెక్ట్ ఆఫీసర్ (హెచ్ఆర్)- 7

  ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్)- 4

  ప్రాజెక్ట్ ఆఫీసర్ (BD)- 4

  Infosys: డిగ్రీ లేకపోయినా ఈ సర్టిఫికెట్ ఉన్నవారికి ఇన్ఫోసిస్‌లో 500 ఉద్యోగాలు

  NTA Recruitment 2021: ఇంటర్, డిగ్రీ, పీజీ పాస్ అయ్యారా? 1145 ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

  BDL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 12

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 31 సాయంత్రం 4 గంటలు

  విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎంఎస్‌డబ్ల్యూ పాస్ అయినవారు అప్లై చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో ఉన్నాయి.

  వయస్సు- 2021 మార్చి 5 నాటికి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

  దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

  వేతనం- మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.36,000, నాలుగో ఏడాది రూ.39,000 లభిస్తుంది.

  ఎంపిక విధానం- మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఆ తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

  Police Jobs: సీఐఎస్ఎఫ్‌లో 2000 కానిస్టేబుల్, ఎస్ఐ జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

  Mahatma Gandhi National Fellowship: డిగ్రీ పాస్ అయినవారికి నెలకు రూ.50,000 స్టైపెండ్‌తో ఫెలోషిప్... మొత్తం 660 ఖాళీలు

  BDL Recruitment 2021: దరఖాస్తు చేయండి ఇలా


  అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ముందుగా https://bdl-india.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  ఆ తర్వాత Career సెక్షన్ పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత RECRUITMENTS క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కనిపిస్తుంది.

  అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అన్ని వివరాలతో దరఖాస్తు చేయాలి.

  ఫోటో, సంతకం, అవసరమైన డాక్యుమెటం్స్ సబ్మిట్ చేయాలి.

  చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.

  దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

  ఉత్తమ కథలు