BDL RECRUITMENT 2020 BHARAT DYNAMICS LIMITED BHANUR MEDAK RELEASED NOTIFICATION FOR 119 APPRENTICE POSTS SS
BDL Recruitment 2020: సంగారెడ్డిలోని బీడీఎల్‌లో 119 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
BDL Recruitment 2020: సంగారెడ్డిలోని బీడీఎల్‌లో 119 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
BDL Recruitment 2020 | డిప్లొమా పాసయ్యారా? బీటెక్ పూర్తి చేశారా? ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ 119 పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
తెలంగాణలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంగారెడ్డిలోని భానూర్‌లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 119 అప్రెంటీస్ పోస్టుల భర్తీ జరుగుతోంది. ఇంజనీరింగ్ డిప్లొమా, డిగ్రీ పాసైనవారు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్‌కు దరఖాస్తు చేయొచ్చు. 2017, 2018, 2019, 2020 సంవత్సరాల్లో పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. ఇవి ఏడాది అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. దరఖాస్తు ప్రక్రియ 2020 నవంబర్ 2న ప్రారంభం కానుంది. నవంబర్ 18 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బీడీఎల్ అధికారిక వెబ్సైట్ https://bdl-india.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS అధికారిక వెబ్సైట్ http://www.mhrdnats.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 83
మెకానికల్ ఇంజనీరింగ్- 35
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 8
సివిల్ ఇంజనీరింగ్- 2
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 10
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 25
కెమికల్ ఇంజనీరింగ్- 2
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 1
టెక్నీషియన్ అప్రెంటీస్- 36
మెకానికల్ ఇంజనీరింగ్- 14
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 4
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 6
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 8
కెమికల్ ఇంజనీరింగ్- 4
దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 2
నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ- 2020 నవంబర్ 18
ఆ తర్వాత భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భానూర్ నోటిఫికేషన్‌కు అప్లై చేయడానికి చివరి తేదీ- 2020 నవంబర్ 20
స్టైపెండ్- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.8000. టెక్నీషియన్ అప్రెంటీస్‌కు రూ.9000.
విద్యార్హతలు- గ్రాడ్యుయేషన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిగ్రీ పాస్ కావాలి. డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాస్ కావాలి.
ఎంపిక విధానం- సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల ప్రకారం ఫైనల్ ర్యాంక్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.