BDL Recruitment 2021: హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

BDL Recruitment 2021: హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు (ప్రతీకాత్మక చిత్రం)

BDL Hyderabad Recruitment 2021 | హైదరాబాద్‌లోని బీడీఎల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 46 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 జూలై 8న అంటే ఇవాళ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 జూలై 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL అధికారిక వెబ్‌సైట్ https://bdl-india.in/ లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పోస్టులో పంపాలి. దరఖాస్తులు పోస్టులో పంపడానికి 2021 జూలై 31 చివరి తేదీ.

    BDL Hyderabad Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు- 46
    జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)- 1
    డిప్యూటీ జనరల్ మేనేజర్ (న్యూ ప్రాజెక్ట్స్)- 3
    మెడికల్ ఆఫీసర్- 2
    అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ)- 3
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్)- 12
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (మెకానికల్)- 9
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్)- 3
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్)- 3
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (కంప్యూటర్ సైన్స్)- 2
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఆప్టిక్స్)- 1
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (బిజినెస్ డెవలప్‌మెంట్)- 1
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఫైనాన్స్)- 3
    మేనేజ్‌మెంట్ ట్రైనీ (హెచ్ఆర్)- 3

    Common Eligibility Test: రైల్వే జాబ్, బ్యాంక్ జాబ్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష... ఎప్పుడంటే

    Coast Guard Jobs 2021: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 350 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    BDL Hyderabad Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 8 మధ్యాహ్నం 2 గంటలు
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 23 రాత్రి 11 గంటలు
    దరఖాస్తులు పోస్టులో పంపడానికి చివరి తేదీ- 2021 జూలై 31
    దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, బీడీఎల్ ఉద్యోగులకు ఫీజు లేదు
    ఎంపిక విధానం- మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుకు కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇతర పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది.

    SBI Jobs Recruitment 2021: ఎస్‌బీఐలో 6100 ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

    TGT Recruitment 2021: మొత్తం 5807 టీచర్ జాబ్స్‌కు దరఖాస్తు గడువు పెంపు

    BDL Hyderabad Recruitment 2021: దరఖాస్తు విధానం


    అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
    భారత్ డైనమిక్స్ లిమిటెడ్-BDL అధికారిక వెబ్‌సైట్ https://bdl-india.in/ లో నోటిఫికేషన్ ఉంటుంది.
    ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
    అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.
    ప్రింట్ తీసుకున్న దరఖాస్తు ఫామ్‌కు అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
    దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
    SM, C-HR(TA&CP), Bharat Dynamics Limited,
    Corporate Office, Plot No. 38-39,
    TSFC Building (Near ICICI Towers),
    Financial District, Gachibowli,
    Hyderabad, Telangana-500032.
    Published by:Santhosh Kumar S
    First published: