హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TS SET Key Canceled: కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ సెట్ నిర్వాహకులు.. ప్రిలిమినరీ కీ క్యాన్సిల్..

TS SET Key Canceled: కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ సెట్ నిర్వాహకులు.. ప్రిలిమినరీ కీ క్యాన్సిల్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీఎస్ సెట్ ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 25 న విడుదల చేసిన ఈ ప్రిలిమినరీ కీలో ఏమైనా తప్పులు ఉంటే.. మార్చి 25 నుంచి మార్చి 27 వరకు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

టీఎస్ సెట్ (TS SET) ఇటీవల ప్రాథమిక కీని(Preliminary Key) విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 25 న విడుదల చేసిన ఈ ప్రిలిమినరీ కీలో ఏమైనా తప్పులు ఉంటే.. మార్చి 25 నుంచి మార్చి 27 వరకు అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చారు. కానీ.. ఇంగ్లీష్ సబ్జెక్టులో పేపర్ 2కు సంబంధించి మొత్తం 33 ప్రశ్నలకు ప్రాథమిక కీలో తప్పులుల ఉన్నట్లు గుర్తించారు. దీంతో మరో సారి రివైజ్డ్ కీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇంగ్లీష్ పేపర్ 2కు(English Paper 2)  సంబంధించి మాత్రమే కీలో మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. టెక్నికల్ సమస్య కారణంగా ఇలాంటి ఘటన చోటు చేసుకుందదని.. దీంతో ఇంగ్లీష్ పేపర్ 2 ప్రిలిమినరీ కీని క్యాన్సిల్ చేసి.. కొత్త కీని అప్ లోడ్ చేస్తామని తెలిపారు.

B Tech Students: బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న JNTU..

ఈ కీని మార్చి 29వ తేదీన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తామని పేర్కొన్నారు. అంతే కాకుండా.. అభ్యంతరాల స్వీకరణకు మరో మూడు రోజులు పొడిగించారు. మార్చి 28, 29, 30వ తేదీ వరకు ప్రతీ ఒక్కరు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని ప్రెస్ నోట్ విడుదల చేశారు. తుది ఫలితాలతో పాటు.. ఫైనల్ కీని కూడా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు(Assistant Professors/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) - 2022 నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. వీటికి ఆన్ లైన్(Online) విధానంలో పరీక్షలను మార్చి 14, 15, 17 తేదీల్లో నిర్వహించారు. అయితే వీటిలో మార్చి 14న నిర్వహించిన సెషన్ 1లో 29 సెంటర్లను ఈ పరీక్ష కొరకు కేటాయించగా.. 8184 అభ్యర్థులకు 6563 మంది హాజరయ్యారు. అలాగే.. సెషన్ 2లో నిర్వహించిన పరీక్షలో 83 శాతం హాజరైనట్లు టీఎస్ సెట్ నిర్వాహకులు తెలిపారు. మార్చి 15న నిర్వహించిన సెషన్ లో కూడా 81 శాతం హాజరు కాగా.. సెషన్ 2లో కూడా 81 శాతం మంది హాజరైనట్లు తెలిపారు.

ఇక మార్చి 17 నిర్వహించిన ఆన్ లైన్ పరీక్షలో సెషన్ 1 లో 77 శాతం.. సెషన్ 2లో కూడా 77 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం మీదు ఈ సెట్ పరీక్షకు 80 శాతం హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 50,256 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 40,128 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలను నిర్వహించిన ఓయూ ఇటీవల ప్రాథమిక కీని విడుదల చేయగా.. ప్రాథమిక కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. మార్చి 25 నుంచి మార్చి 27 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. తాజాగా దీనిని మరో మూడు రోజులు పెంచారు. అంటే మార్చి 30వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు.

ప్రాథమిక కీని చెక్ చేసుకోండిలా..

Step 1: ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.

Step 2: వెబ్ సైట్ లో స్క్రోల్ అవుతున్న ప్రాథమిక కీ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 3: తర్వాత మీ అప్లికేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేసి.. లాగిన్ అవ్వండి.

Step 4: ఇక్కడ మీ ప్రాథమిక కీని చెక్ చేసుకోవచ్చు. దీనిలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా కనిపిస్తుంది.

Step 5: ఓఎంఆర్ పత్రంలోని టాప్ లో మీకు వచ్చిన మార్కులను చూపిస్తుంది.

First published:

Tags: Career and Courses, JOBS, Ts set

ఉత్తమ కథలు