Home /News /jobs /

BASARA IIIT B tech: టెన్త్ పాసైనవారికి బాసర ఐఐఐటీలో డిగ్రీ... అప్లై చేయండి ఇలా

BASARA IIIT B tech: టెన్త్ పాసైనవారికి బాసర ఐఐఐటీలో డిగ్రీ... అప్లై చేయండి ఇలా

BASARA IIIT B tech: టెన్త్ పాసైనవారికి బాసర ఐఐఐటీలో డిగ్రీ... అప్లై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

BASARA IIIT B tech: టెన్త్ పాసైనవారికి బాసర ఐఐఐటీలో డిగ్రీ... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

BASARA IIIT Integrated B Tech Admission 2020-21 | బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనుకునేవారికి శుభవార్త. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

  పదవ తరగతి పాసైన విద్యార్థులకు శుభవార్త. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్-RGUKT అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది. బాసర ఐఐఐటీగా పేరొందిన ఈ కాలేజీలో సీటు కోసం పోటీ ఎక్కువ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2020-21 విద్యా సంవత్సరానికి 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 10వ తరగతి పాసైన విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేయొచ్చు. కోర్సు వివరాలు చూస్తే ప్రీ-యూనివర్సిటీ కోర్స్ రెండేళ్లు ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్‌తో రెండేళ్ల ఎంపీసీ కోర్సు ఇది. ఆ తర్వాత నాలుగేళ్లు కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెటల్లార్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు చేయొచ్చు.

  Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి క్లర్క్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

  IBPS Clerk Jobs: మొత్తం 2557 క్లర్క్ పోస్టుల భర్తీ... తెలంగాణ, ఏపీలో ఖాళీల వివరాలివే

  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో పాటు గల్ఫ్ దేశాలు, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలు, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. 85 శాతం సీట్లు స్థానికులకు అంటే తెలంగాణవాసులకు, 15 శాతం సీట్లు ఇతర ప్రాంతాల వారికి కేటాయించారు. దరఖాస్తు ప్రక్రియ 2020 అక్టోబర్ 3న ముగుస్తుంది. దివ్యాంగులు, సీఏపీ, ఎన్‌‌సీసీ, స్పోర్ట్స్ లాంటి స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో 2020 అక్టోబర్ 6 వరకు దరఖాస్తు చేయొచ్చు. విద్యార్థులు టీఎస్ఆన్‌లైన్ సర్వీసెస్‌లో ఫీజు చెల్లించిన తర్వాత https://admissions.rgukt.ac.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. మరిన్ని వివరాలను https://www.rgukt.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  Anganwadi Jobs: రంగారెడ్డి జిల్లాలో 232 అంగన్వాడీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

  ICMR Jobs: ఐసీఎంఆర్‌లో 141 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

  BASARA IIIT Integrated B Tech Admission: బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్ కోర్సు వివరాలు ఇవే


  దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 16
  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 3
  స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 6
  విద్యార్హతలు- 10వ తరగతిలో వచ్చిన జీపీఏ ద్వారా ఎంపిక చేస్తారు.
  వయస్సు- 2020 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్ల లోపు
  దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.150.
  దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
  The Convener,
  Rajiv Gandhi University of Knowledge Technologies,
  Basar, Nirmal District,
  Telangana State-504107.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Basara, Basara IIIT, Basara triple IT, Exams, Telangana, Telangana News, Telangana updates, Telugu news, Telugu updates, Telugu varthalu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు