Home /News /jobs /

BARC RECRUITMENT 2022 FOR NURSE SCIENTIFIC OFFICER POSTS APPLY ONLINE TILL 12 SEPTEMBER KNOW FULL DETAILS HERE VB

BARC Recruitment 2022: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగాలు.. అసిస్టెంట్, సబ్ అసిస్టెంట్, నర్స్ పోస్టులు..

BARC Recruitment 2022: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగాలు.. అసిస్టెంట్, సబ్ అసిస్టెంట్, నర్స్ పోస్టులు..

BARC Recruitment 2022: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగాలు.. అసిస్టెంట్, సబ్ అసిస్టెంట్, నర్స్ పోస్టులు..

బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా సెప్టెంబర్ 12గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్(Assistant) అండ్ సబ్ ఆఫీసర్(Sub Officer) పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అధికారిక వెబ్‌సైట్ barc.gov.inఈ పోస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అభ్యర్థులు సెప్టెంబర్ 12 వరకు వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 36 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో నర్సు 13, సైంటిఫిక్ అసిస్టెంట్ 19, సబ్ ఆఫీసర్ 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Telangana-AP Postal Vacancies: తెలంగాణ, ఏపీలో భారీగా పోస్టల్ కొలువులు.. ఖాళీల వివరాలు ఇలా..


విద్యార్హత..
నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ డిప్లొమాతో 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు నర్సు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. B.Sc. 60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (DMLT) లేదా 60% మార్కులతో B.Sc (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ).



అదే సమయంలో.. సైంటిఫిక్ అసిస్టెంట్(బీ) పోస్టుల కోసం ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. 60 శాతం మార్కులతో బీఎస్సీ(న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ).

సైంటిఫిక్ అసిస్టెంట్(సీ) పోస్టులకు.. మెడికల్ అండ్ సైకియాట్రిక్/మెంటల్ హెల్త్ సోషల్ వర్క్ సబ్జెక్ట్‌లలో స్పెషలైజేషన్‌తో 50% మార్కులతో మెడికల్ సోషల్ వర్క్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి.

సబ్ ఆఫీసర్/బి.. HSC (10+2) (రసాయన శాస్త్రంతో సైన్స్) లేదా 50% మార్కులతో తత్సమానం + నాగ్‌పూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నుండి సబ్-ఆఫీసర్ కోర్సులో ఉత్తీర్ణత.

సైంటిఫిక్ అసిస్టెంట్/బి (సివిల్) కనీసం 60% మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసి ఉండలి.

వయోపరిమితి
కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే.. సబ్ ఆఫీసర్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలుగా పేర్కొన్నారు.

నర్స్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ. 44,900 జీతం చెల్లించనున్నారు. ఇతర పోస్టులకు రూ. 35,400 చెల్లించనున్నారు. అభ్యర్థులు ఈ లింక్‌ని సందర్శించడం ద్వారా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎంపిక ప్రక్రియ
వివిధ దశల ద్వారా అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ టైప్ టెస్ట్/ డ్రైవింగ్ టెస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్. పూర్తి వివరాలకు అధికారికి వెబ్ సైట్ ను https://recruit.barc.gov.in/barcrecruit/ సందర్శించవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Barc, Career and Courses, Central Government Jobs, Central Govt Jobs, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు