నిరుద్యోగులకు శుభవార్త. భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్-BARC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టైపెండరీ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 160 ఖాళీలున్నాయి. ముంబై, చెన్నైలోని కేంద్రాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది బార్క్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.barc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. https://recruit.barc.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. ఎంపికైన వారికి తారాపూర్, కల్పక్కంలో శిక్షణ ఇస్తారు.
మొత్తం ఖాళీలు- 160
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 (గ్రూప్ బీ) పోస్టులు- 50
మెకానికల్ ఇంజనీరింగ్- 13
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 6
కెమికల్ ఇంజనీరింగ్- 7
సివిల్ ఇంజనీరింగ్- 13
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 3
ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్- 4
కెమిస్ట్రీ- 4
Railway Jobs: రైల్వే జాబ్ మీ కలా? నైరుతి రైల్వేలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు
RRB NTPC Admit Card 2020: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డ్స్ వచ్చేశాయి... డౌన్‌లోడ్ చేయండి ఇలా
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 (గ్రూప్ సీ) పోస్టులు- 106
ప్లాంట్ ఆపరేటర్- 15
ఏసీ మెకానిక్- 1
ఫిట్టర్- 45
వెల్డర్- 5
ఎలక్ట్రీషియన్- 6
ఎలక్ట్రానిక్ మెకానిక్- 11
మెషినిస్ట్- 3
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 13
వెల్డర్- 1
మెకానిక్ డీజిల్- 3
మెషినిస్ట్ గ్రైండ్- 2
ల్యాబరేటరీ అసిస్టెంట్- 1
టెక్నీషియన్- 4
దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 31
ఇంటర్వ్యూ తేదీ- త్వరలో ప్రకటించనున్న బార్క్.
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు.
వేతనం- స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టుకు రూ.18,000, స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 పోస్టుకు రూ.12,500, టెక్నీషియన్ పోస్టుకు రూ.25,500.
దరఖాస్తు ఫీజు- రూ.150. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
ఎంపిక విధానం- మూడు దశల పరీక్షలు పాస్ కావాలి. క్వాలిఫై అయినవారు ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
Jobs: మజగాన్ డాక్‌లో 410 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Jobs: హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 జాబ్స్... దరఖస్తుకు మరో 5 రోజులే గడువు
అభ్యర్థులు ముందుగా https://recruit.barc.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో New User? Register క్లిక్ చేయాలి.
మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి.
ఆ తర్వాత లాగిన్ చేసి జాబ్ అప్లికేషన్ సెలెక్ట్ చేయాలి.
Apply Online పైన క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో ఫామ్ పూర్తి చేయాలి.
చివరగా ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION