హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Education Loans: రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్‌పై 8 శాతం కంటే తక్కువ వడ్డీ.. ఆ బ్యాంకులు ఇవే..

Education Loans: రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్‌పై 8 శాతం కంటే తక్కువ వడ్డీ.. ఆ బ్యాంకులు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు - ఏడు సంవత్సరాల రీపేమెంట్ వ్యవధితో రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్‌పై ఇప్పటికీ 8 శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లను విధిస్తున్నాయి. మరి, ఆ బ్యాంకులు ఏవో తెలుసుకోండి..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ (RBI) గత మే నెల నుంచి రెపో రెట్లను (Repo Rate) పెంచుతూ వచ్చింది. దీంతో ఎడ్యుకేషన్ లోన్లు ఖరీదైనవిగా మారాయి. మరోపక్క కీలకమైన పాలసీ రేటును మొత్తంగా 140 బేసిస్ పాయింట్లు పెంచింది. అంతేకాకుండా, తాజా క్రెడిట్ పాలసీ ప్రకటనలో కూడా అదే మార్గాన్ని ఆర్బీఐ పాటించింది. దీంతో ఇప్పటికే రుణాలు తీసుకున్నవారు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. కాగా అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు - ఏడు సంవత్సరాల రీపేమెంట్ వ్యవధితో రూ.20 లక్షల ఎడ్యుకేషన్ లోన్‌పై (Education Loan) ఇప్పటికీ 8 శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లను విధిస్తున్నాయి. మరి, ఆ బ్యాంకులు ఏవో తెలుసుకోండి..

సెంట్రల్ బ్యాంకు

బ్యాంకు బజార్ డేటా ప్రకారం.. ఎడ్యుకేషన్ లోన్లపై సెంట్రల్ బ్యాంకు అత్యల్ప వడ్డీ రే‌ట్‌ను వసూలు చేస్తుంది. ఏడేళ్ల కాలపరిమితితో రూ. 20లక్షల లోన్‌పై ప్రస్తుతం 6.95 శాతం వడ్డీ రేట్‌ను అమలు చేస్తోంది. ప్రతి నెలా ఈఎంఐ మొత్తం రూ.30,136గా నిర్ణయించింది.

Education Loan: ఎడ్యుకేషన్ లోన్స్ విషయంలో బ్యాంకుల వెనకడుగు.. బ్యాంకుల భయానికి కారణాలేంటి..?

పీఎన్‌బీ

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ మేజర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) చౌకైన రుణదాతల జాబితాలో రెండో స్థానంలో ఉంది. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ పై 7.45 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తుంది. ఏడేళ్ల కాలపరిమితిలో ప్రతి నెలా ఈఎంఐ రూపంలో రూ.30,627 చెల్లించాల్సి ఉంటుంది.

ఎడ్యుకేషన్‌ లోన్‌తో బోలెడు లాభాలు.. అటు చదువుకోవచ్చు.. ఇటు ఇలాంటి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా

ఎస్‌బీఐ

రూ. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్లపై ఎస్‌బీఐ 7.5 శాతం వడ్డీ రేట్‌ను విధిస్తుంది. ఏడేళ్ల కాల వ్యవధిలో ప్రతి నెలా ఈఎంఐ రూపంలో రూ. 30,677 వసూలు చేస్తుంది. అదే విధంగా యూనియన్ బ్యాంక్, IDBI బ్యాంక్ కూడా ఇదే వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి.

ఇండియన్ బ్యాంకు

ఏడేళ్ల కాలపరిమితితో రూ. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్లపై 7.9 శాతం వడ్డీ రేటును విధిస్తుంది. రుణగ్రహీత ప్రతి నెలా రూ.31,073 ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం ఇదే వడ్డీ రేటు‌తో ఎడ్యుకేషన్ లోన్లను మంజూరు చేస్తుంది.

బ్యాంకు ఆఫ్ ఇండియా

బ్యాంకు 8.25 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. ప్రతి నెల రూ. 31,422‌ను ఈఎంఐగా నిర్ణయించింది.

కెనరా బ్యాంకు

రూ. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్‌పై కెనరా బ్యాంక్ వడ్డీ రేట్ 8.3 శాతంగా ఉంది. ఈ లోన్‌ను ఏడేళ్ల కాల వ్యవధిలో తిరిగి ఈఎంఐ రూపంలో ప్రతి నెలా రూ.31,472 చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

రూ.20లక్షల ఎడ్యుకేషన్ లోన్‌పై 8.35శాతం వడ్డీని విధిస్తుంది. ఈ లోన్‌ను ఏడేళ్ల కాల వ్యవధిలో రూ.31,522 తిరిగి ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 8.4 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. EMI మొత్తం రూ. 31,572గా నిర్ణయించింది. ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు 8.65 శాతం వడ్డీ రేటుతో ఈఎంఐ రూ. 31,824గా నిర్ణయించింది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Bank loan, Education Loan, JOBS, Repo rate

ఉత్తమ కథలు