హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Lowest Interest Rates: తక్కువ వడ్డీతో Education Loans.. అందిస్తున్న బ్యాంక్స్ ఇవే..

Lowest Interest Rates: తక్కువ వడ్డీతో Education Loans.. అందిస్తున్న బ్యాంక్స్ ఇవే..

Lowest Interest Rates: తక్కువ వడ్డీతో Education Loans.. అందిస్తున్న బ్యాంక్స్ ఇవే..

Lowest Interest Rates: తక్కువ వడ్డీతో Education Loans.. అందిస్తున్న బ్యాంక్స్ ఇవే..

Bank Loans For Education: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించాలని కోరుకుంటారు. అయితే, అధిక నాణ్యత విద్య సాధారణంగా చాలా ఖరీదైనది. దీని కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు తమ విద్యను కోల్పోతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

చాలా మంది తల్లిదండ్రులు(Parents) తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించాలని కోరుకుంటారు. అయితే, అధిక నాణ్యత విద్య సాధారణంగా చాలా ఖరీదైనది. దీని కారణంగా దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లలు తమ విద్యను కోల్పోతున్నారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో పై చదువులకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు కొన్ని బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. భారతదేశంలో ఇప్పుడు ఏదైనా పెద్ద కోర్సులు, డిగ్రీ చదువుల(Degree Education) కోసం విద్యా రుణాలను అందిస్తున్నాయి. విదేశాల్లో చదువులకు కూడా ఎడ్యూకేషన్ లోన్లు ఇస్తున్నాయి. ట్యూషన్, వసతి, దుస్తులు, లైబ్రరీలు(Libraries) అండ్ ప్రయోగశాలల ఫీజులు, పుస్తకాలు మరెన్నో.. వీటితో పాటే కోర్సు-సంబంధిత ఖర్చులను కవర్ చేయడానికి విద్యా రుణాలు తరచుగా ఉపయోగించబడతాయి. అతి తక్కువ వడ్డీ రేట్లకు(Low Interest Rates) విద్యా రుణం ఇస్తున్న బ్యాంకుల జాబితాను ఇక్కడ తెలుసుకుందాం.

Telangana Jobs: అభ్యర్థుల ఆందోళనతో.. తెలంగాణలో మరో రిక్రూట్ మెంట్ రద్దు..

1. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ లోన్..

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.95 శాతం తక్కువ వడ్డీ రేటుతో విద్యా రుణాన్ని ఇస్తోంది. 7 సంవత్సరాలకు రూ. 20 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇస్తోంది. ఇది సమానమైన నెలవారీ వాయిదాలో తిరిగి చెల్లించవచ్చు. వీటికి నెలకు రూ.30,136 చెల్లించాల్సి ఉంటుంది.

2. పంజాబ్ నేషనల్ బ్యాంక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 7.45 శాతం వడ్డీ రేటుతో విద్యా రుణాన్ని అందిస్తోంది. రూ. 20 లక్షల రుణానికి మొత్తం EMI రూ. 30,627 ప్రతినెల చెల్లించాలి.

3.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు 7.50 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తుంది. ఇది సాధారణం కంటే కొంచెం ఎక్కువ. ఈ లోన్ EMI రూ. 30,677గా ఉంటుంది. అంతే కాకుండా.. ఇదే వడ్డీ రేటుతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , IDBI బ్యాంక్ కూడా అదే వడ్డీ రేటుతో విద్యా రుణాన్ని అందిస్తున్నాయి.

4. ఇండియన్ బ్యాంక్

ఇండియన్ బ్యాంక్ రూ. 20 లక్షల ఏడు సంవత్సరాల రుణంపై 7.90 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. దీని EMI రూ. 31,073గా ఉంటుంది.

Telangana Gurukul Posts: గురుకుల పోస్టుల భర్తీపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు.. 10 వేల పోస్టులకు ముందడుగు..!

5. బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా ఏడు సంవత్సరాల కాలవ్యవధికి రూ. 20 లక్షల విద్యా రుణంపై 7.90 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా EMI రూ. 31,073గా ఉంటుంది.

6. కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ నుండి రూ. 20 లక్షల ఎడ్యుకేషన్ లోన్ ఏడు సంవత్సరాల తిరిగి చెల్లించే వ్యవధితో 8.30 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. దాని లోన్ మొత్తం EMI రూ. 31,472.

7. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎడ్యుకేషన్ లోన్ పాలసీ

విద్యార్థి రుణాలకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వడ్డీ రేటు 8.35శాతం అందిస్తోంది. దీని నెలవారీ చెల్లింపు వాయిదా రూ. 31,522గా ఉంటుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Education Loan, JOBS

ఉత్తమ కథలు