ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు బ్యాంకు జాబ్స్ (Bank Jobs) కు కూడా విపరీతమైన పోటీ నెలకొంది. బ్యాంకుల్లో ఉద్యోగం సాధిస్తే జాబ్ సెక్యూరిటీ(Job Security)తో పాటు మంచి వేతనం కూడా ఉంటుందన్న భావనతో నిరుద్యోగులకు ఈ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. తాజాగా నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank Of Maharashtra) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ (Scale I&II) విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో (Job Notification) స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే సెప్టెంబర్ 1న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 190 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం | 190 |
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ | 100 |
సెక్యూరిటీ ఆఫీసర్ | 10 |
లా ఆఫీసర్ | 10 |
హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ | 10 |
ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ | 30 |
DBA(MSSQL/Oracle) | 3 |
విండోస్ అడ్మినిస్ట్రేటర్ | 12 |
ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ | 3 |
నెట్వర్క్&సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ | 10 |
ఈమెయిల్ అడ్మినిస్ట్రేటర్ | 2 |
అర్హతల వివరాలు..
అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్: అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, ఫుడ్ సైన్స్ తితర విభాగాల్లో నాలుగేళ్ల డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, PwD అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.
UBI Recruitment 2021: రూ.78,000 వేతనంతో యూనియన్ బ్యాంక్‌లో 347 ఉద్యోగాలు
సెక్యూరిటీ ఆఫీసర్: ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ గా ఐదేళ్ల అనుభవం కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
లా ఆఫీసర్: లాలో బ్యాచలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అన్ని సెమిస్టర్స్ లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
-ఐటీ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్/DBA/విండోస్ అడ్మినిస్ట్రేటర్/నెట్వర్క్&సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్/ఈ మెయిల్ అడ్మినిస్ట్రేటర్/ప్రొడక్ట్ సపోర్ట్ ఇంజనీర్: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తదితర విభాగాల్లో బీటెక్ చేసిన వారు, MCA, M.Sc కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులు ఈ విభాగాల్లోని ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
-అభ్యర్థులు అర్హతలకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
SAI Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. SAIలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్.. వివరాలివే
Application Fee:
అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 1,180 చెల్లించాల్సి ఉంటుంది, PwBD, మహిళలా అభ్యర్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఇచ్చారు.
Selection process: ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.
Indian Navy Jobs 2021: ఇండియన్ నేవీలో 230 ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి
ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Step 2: రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త లింక్ ఓపెన్ ఓపెన్ అవుతుంది.
Step 3: పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ తదితర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Step 4: రిజిస్ట్రేషన్ అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ జనరేట్ అవుతుంది.
Step 5: ఆ వివరాలతో లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
Step 6: ఆ ఫామ్ లో కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs 2021, Bank of Maharashtra, Job notification, JOBS