హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bank Jobs 2023: ప్రముఖ బ్యాంక్ లో 225 ఆఫీసర్ జాబ్స్.. పూర్తి వివరాలివే

Bank Jobs 2023: ప్రముఖ బ్యాంక్ లో 225 ఆఫీసర్ జాబ్స్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల బ్యాంక్ ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సైతం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఇటీవల బ్యాంక్ ఉద్యోగాలకు (Bank Jobs) వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank Of Maharashtra) సైతం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 225 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అంటే జనవరి 23న ప్రారంభం కాగా.. దరఖాస్తు (Bank Jobs Application) చేసుకోవడానికి ఫిబ్రవరి 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంద.

విద్యార్హతల వివరాలు:

మొత్తం 29 విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయో పరిమితిని 25-35 ఏళ్లు.

ఎలా అప్లై చేయాలంటే?

Step 1: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://bankofmaharashtra.in/ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో Careers ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 3: తర్వాత Recruitment Process విభాగంలో Current Openings ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4: నోటిఫికేషన్ కింద Registration Link ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 5: ఆ పేజీలో వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

First published:

Tags: Bank Jobs, JOBS

ఉత్తమ కథలు