బ్యాంకులో ఉద్యోగం కోరుకునేవారికి గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 150 ఖాళీలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌లల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 ఏప్రిల్ 6 లోగా దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bankofmaharashtra.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసేముందు ఇదే వెబ్సైట్లో నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 150
ఎస్సీ- 22
ఎస్టీ- 11
ఓబీసీ- 40
ఈడబ్ల్యూఎస్- 15
అన్రిజర్వ్డ్- 62
MES Recruitment 2021: మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో 502 జాబ్స్... ఖాళీల వివరాలు ఇవే
KVS Recruitment 2021: మహబూబాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయలో జాబ్స్
దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 6
విద్యార్హతలు- బ్యాచిలర్స్ డిగ్రీ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్ఏ, ఎఫ్ఆర్ఎం లాంటి కోర్సులు పాస్ అయినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
అనుభవం- ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో మూడేళ్లు ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు- 25 నుంచి 35 ఏళ్లు
దరఖాస్తు ఫీజు- అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1,180. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.118.
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఇంటర్వ్యూ
వేతనం- రూ.48,710+అలవెన్సులు
Job Mela in Vijayawada: మొత్తం 800 ఉద్యోగాల భర్తీకి విజయవాడలో ఇంటర్వ్యూలు... యువతులకు మాత్రమే
GMH Tirupati Recruitment 2021: తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
అభ్యర్థులు ముందుగా https://www.bankofmaharashtra.in/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Current Openings పైన క్లిక్ చేయాలి.
అందులో Recruitment of Generalist Officers in Scale II (Project 2) 2021-22 నోటిఫికేషన్ కనిపిస్తుంది.
Apply Online పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.
పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
ఫోటో, సంతకం అప్లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.
ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.
దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.
మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank Jobs 2021, CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION