బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శుభవార్త చెప్పింది. మొత్తం 314 అప్రెంటీస్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ bankofmaharashtra.inను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థికి రాష్ట్రంలోని స్థానిక భాషపై పట్టు ఉండాలి. అంటే స్థానిక భాష రాయడం, మాట్లాడడం మరియు చదవడం ఎలాగో తెలిసి ఉండాలి. దరఖాస్తు చేసే అభ్యర్థి యొక్క వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర , UR, EWS మరియు OBC కేటగిరీ అభ్యర్థులు అప్రెంటీస్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి రూ. 150 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. SC, ST కేటగిరీ అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. PWBD అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 23 డిసెంబర్ 2022 .
దరఖాస్తు ఇలా..
- ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి.. ముందుగా అధికారిక వెబ్‌సైట్ bankofmaharashtra.inకి వెళ్లండి.
-ఇక్కడ కెరీర్స్ అనే ట్యాబ్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేయండి.
-తదుపరి కరెంట్ ఓపెనింగ్స్‌పై క్లిక్ చేయండి.
-కనిపిస్తున్న కొత్త పేజీలో ప్రాజెక్ట్ 2022-23లో రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
-ఇక్కడ అవసరమైన వివరాలతో దరఖాస్తును పూరించండి.
-చివరకు అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ తీసుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Bank Jobs 2022, JOBS, Jobs in banks