హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bank of India Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

Bank of India Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు ప్రముఖ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Bank Of India) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బ్యాంకు నుంచి తాజాగా నోటిఫికేషన్(Notification) విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

ఇటీవల పలు బ్యాంకుల్లోని ఖాళీల(Bank Jobs) భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు (Bank Jobs Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా(Bank of India) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు(Bank of India Jobs) తెలిపింది. ఈ మేరకు బ్యాంకు నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు(Jobs) అప్లై చేసేందుకు ఈ నెల 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో(Notification) పేర్కొన్నారు. అయితే కాంట్రాక్ట్(Contract Jobs) విధానంలో ఈ ఖాళీ(Jobs)లను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

ఖాళీల వివరాలు..

పోస్టు ఖాళీలు
ఫ్యాకల్టీ1
ఆఫీస్ అసిస్టెంట్4
ఆఫీస్ అటెండెంట్2
వాచ్ మెన్ కం గార్డెనర్4
ఫైనాన్సియల్ లిటరసీ కౌన్సెలర్1
మొత్తం ఖాళీలు12


విద్యార్హతల వివరాలు..

ఫ్యాకల్టీ(Faculty):

అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఒకేషనల్ కోర్సుల్లో డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. స్థానిక భాషలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ లో నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయస్సు 25 నుంచి 63 ఏళ్లు ఉండాలి.

Andhra Pradesh Jobs: ఏపీలో మరో జాబ్ మేళా.. డిగ్రీ, పీజీ అర్హతతో ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే

ఆఫీస్ అసిస్టెంట్(Office Assistant):

అభ్యర్థి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్థానిక భాషలో మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలి, ఎంఎస్ ఆఫీస్ లో నైపుణ్యం ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. వయస్సు 18 నుంచి 43 ఏళ్లు ఉండాలి.

ఆఫీస్ అటెండెంట్(Attendant):

అభ్యర్థి టెన్త్ పాసై ఉండాలి. స్థానిక భాషలో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. స్థానిక జిల్లాలో నివాసం ఉండే వారికి ప్రాధాన్యం ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయస్సు 18 నుంచి 63 ఏళ్లు ఉ:డాలి.

IOCL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో 527 ఖాళీలు.. వివరాలివే..


వాచ్ మెన్ కం గార్డెనర్(Watchman Cum Gardener): టెన్త్ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. స్థానిక భాషలో రాయడం, చదవడం వచ్చిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. అగ్రికల్చర్/గార్డెనింగ్/హార్టికల్చర్ లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది.

ఫైనాన్షియల్ లిటెరసీ కౌన్సెలర్(Financial Literacy Counselor): యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్/పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 62 ఏళ్ల లోపు ఉండాలి.

NFL Recruitment 2021: నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. రూ. 1.40 లక్షల వరకు వేతనం.. ఇలా అప్లై చేయండి

ఎలా అప్లై చేయాలంటే..

-అభ్యర్థులు మొదటగా అప్లికేషన్ ఫామ్ (Application Form) ను బ్యాంకు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ను పూర్తిగా నింపి The Zonal Manager, Bank Of India, Lucknow Zonal Office, Star House, Vibhuti Khandm Gomtinagar, Lucknow, UP Pin-226010 చిరునామాకు ఈ నెల 15 వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

First published:

Tags: Bank Jobs 2021, Bank of India, Government jobs, JOBS

ఉత్తమ కథలు