Bank Jobs: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Bank of India Recruitment 2020 | బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 31, 2020, 5:55 PM IST
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బ్యాంక్ ఆఫ్ ఇండియా-BOI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. క్లర్క్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 28 ఖాళీలను ప్రకటించింది. ఇందులో క్లర్క్ పోస్టులు 14, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ పోస్టులు 14 ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. అంటే స్పోర్ట్స్ పర్సన్స్ మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 ఆగస్ట్ 1న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 ఆగస్ట్ 16 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bankofindia.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 26,778 ఉద్యోగాలు... వారం రోజుల్లోనే భర్తీ

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 ఉద్యోగాలు... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీలు

Bank of India Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు- 28
ఆర్చరీ: క్లర్క్- 2, ఆఫీసర్ 2
అథ్లెటిక్స్: క్లర్క్- 2, ఆఫీసర్ 2బాక్సింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2
జిమ్నాస్టిక్: క్లర్క్- 2
స్విమ్మింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2
టేబుల్ టెన్నిస్: ఆఫీసర్ 2
వెయిట్ లిఫ్టింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2
రెజ్లింగ్: క్లర్క్- 2, ఆఫీసర్ 2

ESI Hyderabad Jobs: హైదరాబాద్‌లోని ఈఎస్ఐలో 120 జాబ్స్... ఖాళీల వివరాలివే

SBI Jobs: ఎస్‌బీఐలో 3850 జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

Bank of India Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 16
విద్యార్హత- క్లర్క్ పోస్టుకు 10వ తరగతి. ఆఫీసర్ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ.
స్పోర్ట్స్ క్వాలిఫికేషన్: క్లర్క్ పోస్టుకు స్పోర్టింగ్ ఈవెంట్ / కేటగిరీ డీలో ఛాంపియన్‌షిప్. ఆఫీసర్ పోస్టుకు స్పోర్టింగ్ ఈవెంట్ / కేటగిరీ ఏ, బీ, సీలో ఛాంపియన్‌షిప్.
వయస్సు- క్లర్క్ పోస్టుకు 18-25 ఏళ్లు. ఖేలో ఇండియా స్పోర్టింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నవారికి 20 నుంచి 25 ఏళ్లు. ఇక ఆఫీసర్ పోస్టుకు 18-25 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.50.
Published by: Santhosh Kumar S
First published: July 31, 2020, 5:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading