హోమ్ /వార్తలు /jobs /

BOI Jobs 2021: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. ఈ రోజు నుంచే దరఖాస్తులు ప్రారంభం.. ఇలా అప్లై చేయండి

BOI Jobs 2021: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. ఈ రోజు నుంచే దరఖాస్తులు ప్రారంభం.. ఇలా అప్లై చేయండి

బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank Of India) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు (Jobs) దరఖాస్తు ప్రక్రియను అధికారులు ఈ రోజు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఇటీవల పలు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అనేక బ్యాంకుల్లో ఉద్యోగాల (Bank Jobs) భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. మొత్తం 25 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సెక్యూరిటీ ఆఫీసర్ (Security Officer) విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 24 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు జనవరి 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    విద్యార్హతల వివరాలు:

    గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కనీసం మూడు నెలల సర్టిఫికేషన్ కోర్సు చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు కనీసం ఐదేళ్ల పాటు ఆర్మీ/నేవీ/ఎయిర్ఫోర్స్ లో పని చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలకు వయోపరిమితిగా 40 ఏళ్లను నిర్ణయించారు. అభ్యర్థులు నవంబర్ 1 నాటికి 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య తప్పనిసరిగా ఉండాలి.

    అభ్యర్థుల ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    BEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. మచిలీపట్నం BELలో రూ.35 వేల వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్

    ఎలా అప్లై చేయాలంటే..

    Step 1: అభ్యర్థులు మొదట బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https://bankofindia.co.in/ ను ఓపెన్ చేయాలి.

    Step 2: అనంతరం Career ఆప్షన్ పై క్లిక్ చేయండి.

    Step 3: Recruitment of Specialist Security Officers అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయండి.

    Step 4: తర్వాత మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో CLICK for Apply Online (From 24.12.2021) ఆనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

    అనంతరం కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

    Railway Jobs: నిరుద్యోగులకు అలర్ట్... ఈ రైల్వే ఉద్యోగాల దరఖాస్తుకు 3 రోజులే గడువు

    Step 5: అక్కడ Click here for New Registration ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

    Step 6: అక్కడ పేరు. మొబైల్ నంబర్, తదితర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో మీకు రిజిస్ట్రేషన్ నంబర్ జనరేట్ అవుతుంది.

    Step 7: అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.

    Step 8: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ భద్రపరుచుకోవాలి.

    First published:

    ఉత్తమ కథలు