నిరుద్యోగులకు ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీ ప్రొఫెషనల్స్ విభాగంలో వివిధ ఖాళీల భర్తీకి ఈ నియామకాలను చేపట్టింది బ్యాంక్. మొత్తం 60 ఖాళీలను ఈ నోటిఫికేషన్ (BOB Notification) ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే.. కాంట్రాక్ట్ విధానంలో ఈ నియామకాలను చేపట్టినట్లు బ్యాంక్ తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతల వివరాలు:
కంప్యూటర్ సైన్స్ లేదా ఐన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్లో చూడొచ్చు.
SBI Recruitment 2022: SBIలో డిగ్రీ అర్హతతో 1422 జాబ్స్ .. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. ఇలా అప్లై చేసుకోండి
దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో రూ.600 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, PWD, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులను మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ఎలా అప్లై చేయాలంటే:
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://www.bankofbaroda.in/ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం కెరీర్ (https://www.bankofbaroda.in/career) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత “Current Opportunities” పై క్లిక్ చేయాలి.
Step 4: అనంతరం నోటిఫికేషన్ విభాగంలో Apply Now ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 5: సూచించిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు పూర్తి చేయాలి.
Step 6: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ ను భద్రపరుచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Job notification, JOBS