BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

Bank of Baroda Recruitment 2019 | వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in/index.htm ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు.

news18-telugu
Updated: August 31, 2019, 10:15 AM IST
BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 31, 2019, 10:15 AM IST
ఐటీ ప్రొఫెషనల్స్‌కు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ముంబైలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఐటీ సెంటర్ ఎక్సలెన్స్‌ బరోడాసన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ పోస్టులివి. డిజైన్ థింకింగ్, ప్రాసెస్ రీఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ డిజైన్, కోర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లాంటి విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. మొత్తం 25 ఖాళీలున్నాయి. ఈ పోస్టులన్నీ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికే. డేటా అనలిస్ట్, డేటా మేనేజర్, డేటా ఇంజనీర్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in/index.htm ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తుకు సెప్టెంబర్ 2 చివరి తేదీ. ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Bank of Baroda Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం పోస్టులు- 25

డేటా అనలిస్ట్- 4
డేటా మేనేజర్- 2
డేటా ఇంజనీర్- 4


బిజినెస్ అనలిస్ట్- 2
Loading...
మొబిలిటీ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్- 6
ఇంటిగ్రేషన్ ఎక్స్‌‌పర్ట్- 2
ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎక్స్‌పర్ట్- 4
టెక్నాలజీ ఆర్కిటెక్ట్- 1

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... ఉద్యోగాలు ప్రకటించిన ఉత్తర రైల్వే

SSC Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

UPSC Jobs: పలు ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్
First published: August 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...