BANK OF BARODA RECRUITMENT 2022 THE BANK IS RECRUITING CANDIDATES FOR THE POST OF SPECIALIST OFFICER FOR A TOTAL OF 325 POSTS HERE APPLY DETAILS SRD
Bank Of Baroda Recruitment 2022 : నిరుద్యోగులకు అలర్ట్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 325 జాబ్స్.. అప్లై చేసుకోండి ఇలా..
ప్రతీకాత్మక చిత్రం
Bank Of Baroda Recruitment 2022 : నిరుద్యోగులకు అలర్ట్. భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఒక్కసారి నోటిఫికేషన్ పరిశీలించి ఉద్యోగాలకి అప్లై చేసుకోగలరు.
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) పలు ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఒక్కసారి నోటిఫికేషన్ పరిశీలించి ఉద్యోగాలకి అప్లై చేసుకోగలరు. ఈ రిక్రూట్ మెంట్ కింద క్రెడిట్ విభాగంలో స్పెషలిస్ట్ ఆఫీసర్ల (Specalist Officers)ను నియమించుకోనుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. దరఖాస్తులు జూన్ 22, 2022న విడుదల చేయబడ్డాయి. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ కోసం అప్లై చేయడానికి ఆఖరి తేది జూలై 12, 2022. BOB రిక్రూట్మెంట్ 2022లో 325కి పైగా పోస్టులను భర్తీ చేయనుంది బ్యాంక్.
BOB రిక్రూట్మెంట్ 2022: ఖాళీల వివరాలు
స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టు కింద నాలుగు సబ్ పోస్టులు ఉండగా మొత్తం 325 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
1. రిలేషన్షిప్ మేనేజర్ - 75
2. కార్పొరేట్ మరియు ఇన్స్ట్. క్రెడిట్ - 100
3. క్రెడిట్ అనలిస్ట్ - 100
4. కార్పొరేట్ మరియు ఇన్స్ట్. క్రెడిట్ - 50
విద్యార్హతలు :
అభ్యర్థులు కనీసం ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి... లేదా ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ కోర్సుతో పోస్ట్-గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ అన్ని పోస్టులకు ఒకే విధంగా ఉంటుంది. అలాగే, అభ్యర్థులు CA/CFA/CMA/CS అయి ఉండాలని కూడా అర్హత ప్రమాణాలు పేర్కొన్నాయి. అలాగే, సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
వయసు :
అభ్యర్థుల వయసు 25 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
BOB రిక్రూట్మెంట్ 2022: ఫీజు వివరాలు
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్ధులకు ఫీజు రూ.600 చెల్లించాలి. ఇక, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళల కేటగిరీ రూ.100 చెల్లించాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ ఒకసారి గమనిస్తే మంచిది.
ఎంపిక విధానం :
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం :
మొత్తం 225 మార్కులకు గాను 150 నిమిషాల పాటు పరీక్ష జరగనుంది. నెగటివ్ మార్కింగ్ విధానం ఉంది.
పే స్కేల్ :
నెలకు రూ.69,180ల నుంచి రూ. 89,890ల వరకు జీతంగా చెల్లిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.