Home /News /jobs /

BANK OF BARODA RECRUITMENT 2021 NOTIFICATION RELEASED FOR VARIOUS JOB VACANCIES DEC 28 IS LAST DATE FOR APPLICATIONS NS

Bank of Baroda Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

బీటెక్ చేసిన వారికి శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

బీటెక్ చేసిన వారికి శుభవార్త.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. ఇలా అప్లై చేయండి

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు (Jobs) ఈ నెల 28వ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    కరోనా (Corona) నేపథ్యంలో ఆగిపోయిన నియామకాలు (Recruitments) ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు పలు ఉద్యోగాల భర్తీకి (Jobs) వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. డవలపర్ తో పాటు ఇతర విభాగంలోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు డిసెంబర్ 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    ఖాళీల వివరాలు..
























































    పోస్టుఖాళీలు
    క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్2
    క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజనీర్స్12
    డెవలపర్ (Full Stack Java):12
    డెవలపర్(మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్):12
    UI/UX డిజైనర్2
    క్లౌడ్ ఇంజనీర్2
    అప్లికేషన్ ఆర్కిటెక్ట్2
    ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్2
    టెక్నాలజీ ఆర్కిటెక్ట్2
    ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్2
    ఇంటిగ్రేషన్ ఎక్సెప్ట్2
    మొత్తం:52

    -ఇందులో మొదటి ఐదు విభాగాల్లో పోస్టులు రెగ్యులర్ ఉద్యోగాలు కాగా.. మిగతావి కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
    విద్యార్హతల వివరాలు:
    ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్ చేసి ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల CIBIL Score కనీసం 650 ఉండాలి.
    RRB Group D Exam: రైల్వే గ్రూప్‌-డీ ప్రిపేర్ అవుతున్నారా.. సెల‌బ‌స్ అండ్ స్ట‌డీ ప్లాన్ వివ‌రాలు!

    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు మొదటగా https://www.bankofbaroda.in/ లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 2: అనతరం కెరీర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అనంతరం current-opportunities ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 4: Recruitment of IT Officers / Professionals ఆప్షన్ ను ఎంచుకోవాలి.
    Ste 5: మీరు రెగ్యులర్ వేకెన్సీస్ కు అప్లై చేయాలనుకుంటే Apply for Regular Vacancies ఆప్షన్ ను ఎంచుకోవాలి.  కాంట్రాక్ట్ విభాగాల్లోని పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న Apply for Contractual Vacancies ఆప్షన్ ను ఎంచుకోవాలి.
    Step 6: తర్వాత అప్లికేషన్ ఫామ్ లో సూచించిన వివరాలను నమోదు చేయాలి. అప్లికేషన్ ఫామ్ ను నింపిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాలి.


    అప్లికేషన్ ఫీజు: ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు రూ. 600 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ/PWD అభ్యర్థులు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజును కేవలం ఆన్లైన్ లోనే చెల్లించాల్సి ఉంటుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Bank Jobs, Bank of Baroda, Central Government Jobs, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు