బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిలేషన్షిప్ మేనేజర్ (Relationship Manager) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 376 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకింగ్ రీజియన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 12 పోస్టులు ఉన్నట్టు నోటిఫికేషన్లో వెల్లడించింది బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda). డిగ్రీ పాస్ అయినవారితో పాటు బ్యాంకింగ్ రంగంలో రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 9 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 115 ఉద్యోగాలు... రూ.1,00,000 వరకు వేతనం
మొత్తం ఖాళీలు | 376 | విద్యార్హతలు | అనుభవం | వయస్సు |
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ | 326 (హైదరాబాద్- 12) | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్మెంట్లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయినవారికి, NISM, IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. | ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, సెక్యూరిటీ సంస్థలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో వెల్త్ మేనేజ్మెంట్లో రిలేషన్షిప్ మేనేజర్‌గా రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. | 24 నుంచి 35 ఏళ్లు |
ఇ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ | 50 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్మెంట్లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయినవారికి, NISM, IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. | ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, సెక్యూరిటీ సంస్థలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో వెల్త్ మేనేజ్మెంట్లో రిలేషన్షిప్ మేనేజర్‌గా ఏడాదిన్నర పనిచేసిన అనుభవం ఉండాలి. | 23 నుంచి 35 ఏళ్లు |
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1,317 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Bank of Baroda Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 19
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 9
ఎంపిక విధానం- పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.100.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Post Office Jobs: పోస్ట్ ఆఫీసుల్లో 257 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Step 1- అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ https://www.bankofbaroda.in/ లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.
Step 2- Current Opportunities క్లిక్ చేస్తే సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఇ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ నోటిఫికేషన్స్ వేర్వేరుగా ఉంటాయి.
Step 3- మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన Apply Now పైన క్లిక్ చేయాలి.
Step 4- కొత్త పేజీ అవుతుంది. పోస్ట్ పేరు సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 5- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
Step 6- ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
Step 7- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Bank of Baroda, CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS