హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BOB Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BOB Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BOB Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

BOB Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Bank of Baroda Recruitment 2021 | బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల (Specialist Officer Jobs) భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సులు పాస్ అయినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.

    బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌ని (IT Professionals) నియమించుకుంటోంది. మొత్తం 15 ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని (Specialist Officer Jobs) భర్తీ చేస్తోంది. బ్యాంక్స్ అనలిటికల్ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 నవంబర్ 16న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 6 చివరి తేదీ. బీటెక్, ఎంటెక్ లాంటి కోర్సులు పాస్ అయినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు అనుభవం కూడా తప్పనిసరి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్‌లో విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

    Telangana Jobs: రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Bank of Baroda Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


    మొత్తం ఖాళీలు15విద్యార్హతలువయస్సు
    డేటా సైంటిస్ట్9కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ పాస్ కావాలి.25 నుంచి 40 ఏళ్లు
    డేటా ఇంజనీర్6కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి.25 నుంచి 35 ఏళ్లు


    UPSC Recruitment 2021: రూ.2,18,000 వరకు వేతనంతో ఉద్యోగాలు... బీటెక్, బీఎస్సీ పాస్ అయినవారు అప్లై చేయండి ఇలా

    Bank of Baroda Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 16

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 6

    విద్యార్హతలు- బీటెక్, బీఈ, ఎంటెక్ పాస్ కావాలి.

    వయస్సు- 25 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

    ఎంపిక విధానం- గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ

    అప్లికేషన్ ఫీజు- రూ.600

    వేతనం- రూ.69,180 నుంచి రూ.89,890

    ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    LIC Recruitment 2021: ఎల్ఐసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... డిగ్రీ పాస్ అయితే చాలు

    Bank of Baroda Recruitment 2021: అప్లై చేయండి ఇలా


    Step 1- అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ https://www.bankofbaroda.in/ లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.

    Step 2- Current Opportunities క్లిక్ చేస్తే Recruitment Of IT Specialist Officers నోటిఫికేషన్ కనిపిస్తుంది.

    Step 3- నోటిఫికేషన్ చదివిన తర్వాత Apply Now పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ అవుతుంది.

    Step 4- అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.

    Step 5- ముందే రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి లాగిన్ చేయాలి.

    Step 6- లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఆరు దశల్లో ఉంటుంది.

    Step 7- మొదటి దశలో పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

    Step 8- రెండో స్టేజ్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

    Step 9- మూడో దశలో ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

    Step 10- నాలుగో దశలో అప్లికేషన్ వివరాలన్నీ సరిచూసుకోవాలి.

    Step 11- ఐదో దశలో ఎడమ చేతి వేలి ముద్ర, చేతితో రాసిన డిక్లరేషన్ అప్‌లోడ్ చేయాలి.

    Step 12- ఆరో దశలో దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.

    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank Jobs, Bank of Baroda, CAREER, Central Government Jobs, Govt Jobs 2021, Job notification, JOBS

    ఉత్తమ కథలు