BANK OF BARODA INVITING APPLICATIONS FOR VARIOUS JOBS VACANCIES FOLLOW THESE STEPS TO APPLY NS
BOB Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. ఈ రోజు నుంచే దరఖాస్తులు ప్రారంభం.. ఇలా అప్లై చేయండి
బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. ఈ రోజు నుంచే దరఖాస్తులు ప్రారంభం.. ఇలా అప్లై చేయండి
ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Bank Jobs Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు జనవరి 7న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ స్టెప్స్ తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రముఖ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Bank Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 105 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (జనవరి 7) ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి ఈ నెల 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేవారు.
విద్యార్హతల వివరాలు:
-వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగంలో మొత్తం 58 ఖాళీలు ఉన్నాయి. హెడ్ వెల్త్ స్ట్రాటజిస్ట్, ప్రైవేట్ బ్యాంకర్, పోర్ట్ ఫోలియో రిసెర్చ్ అనలిస్ట్, ప్రొడక్ట్ మేనేజర్, ట్రేడ్ రెగ్యులేషన్, గ్రూప్ సేల్స్ హెడ్ తదితర పోస్టులు ఈ విభాగంలో ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. ఇంకా టెక్నీకల్ నాలెడ్జ్ ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 22 నుంచి 50 ఏళ్లు ఉండాలి. Bank Jobs Recruitment 2022: ఆ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి
-అగ్రి బ్యాంకింగ్ విభాగంలో 47 అగ్రికల్చర్ మార్కెటింగ్ ఖాళీలు ఉన్నాయి.సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. సంబంధితన విభాగంలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 25 నుంచి 40 ఏళ్లు ఉండాలి. SBI Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 1,226 ఉద్యోగాలు... ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదే
ఎలా అప్లై చేయాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. Step 1:అభ్యర్థులు మొదటగా బ్యాంకు అధికారిక వెబ్ సైట్ https://www.bankofbaroda.in/ ఓపెన్ చేయాలి. Step 2:అనంతరం Career ఆప్షన్ ను ఎంచుకోవాలి. Step 3:Current Opportunities ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 4:అనంతరం Recruitment of Agriculture Marketing Officer for Centre for Agri - Finance Marketing, Recruitment of various positions under Wealth Management Services Department on Contract Basis రెండు జాబ్ ప్రొఫైల్స్ కనిపిస్తాయి. Step 5:ప్రతీ ప్రొఫైల్ కింద Apply now ఆప్షన్లు కనిపిస్తాయి. ఆ ఆప్షన్లపై క్లిక్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.