BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు

Bank of Baroda Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 2 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి ఆగస్ట్ 17 చివరి తేదీ.

news18-telugu
Updated: July 31, 2019, 12:23 PM IST
BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు... దరఖాస్తుకు రెండు రోజులే గడువు
BOB Jobs: బీటెక్ పాసయ్యారా? బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు (image: Bank of Baroda)
news18-telugu
Updated: July 31, 2019, 12:23 PM IST
ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం బీటెక్ పాసైనవారి నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. మొత్తం 35 ఖాళీలున్నాయి. వివిధ విభాగాల్లో మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తోంది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఆయా విభాగాల్లో బీటెక్ లేదా బీఈ, ఎంసీఏ, బీసీఏ ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. మేనేజర్ ఐటీ పోస్టుకు 25 నుంచి 32 ఏళ్లు, సీనియర్ మేనేజర్ ఐటీ పోస్టుకు 28 నుంచి 35 ఏళ్ల వయస్సుండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్‌, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.  ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 2 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి ఆగస్ట్ 17 చివరి తేదీ. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఐటీ స్పెషలిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Bank of Baroda Recruitment: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 35

మేనేజర్ ఐటీ (Unix Administrator) - 01
మేనేజర్ ఐటీ (Linux Administrator)- 01
మేనేజర్ ఐటీ (Windows Administrator)- 01


మేనేజర్ ఐటీ (Oracle Administrator)- 02
మేనేజర్ ఐటీ (SQL ) Administrator- 02
మేనేజర్ ఐటీ (Network Administration)- 02
మేనేజర్ ఐటీ (Middleware Administrator Web Sphere)- 01
మేనేజర్ ఐటీ (Middleware Administrator Web Logic)- 01
మేనేజర్ ఐటీ (Data Center administration -Building Management System)- 02
మేనేజర్ ఐటీ (ETL Developer)- 01
మేనేజర్ ఐటీ (Software Developer)- 05
మేనేజర్ ఐటీ (Finacle Developer)- 06
సీనియర్ మేనేజర్- ఐటీ (System Administrator)- 02
సీనియర్ మేనేజర్- ఐటీ (ETL Developer)- 01
సీనియర్ మేనేజర్- ఐటీ (Software Developer)- 02
సీనియర్ మేనేజర్- ఐటీ (Finacle Developer)- 05

Bank of Baroda Recruitment 2019: దరఖాస్తు చేసుకోండి ఇలా


ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ bankofbaroda.in ఓపెన్ చేయండి.
కెరీర్ సెక్షన్ ఓపెన్ చేయండి.
IT Specialist Officers-Project 2019-20 లింక్ పైన క్లిక్ చేయండి.
ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
"Click here to apply for Specialist IT Officers posts" లింక్ పైన క్లిక్ చేయండి.
మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయండి.
మీ దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోండి.
దరఖాస్తుకు ఆగస్ట్ 2 చివరి తేదీ.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Kia Seltos: మార్కెట్‌లోకి వచ్చేస్తున్న కియా సెల్టోస్... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

APSET: ఆగస్ట్ 5 నుంచి ఏపీసెట్ దరఖాస్తుల స్వీకరణ... అక్టోబర్ 20న పరీక్ష

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...