BANK OF BARODA INVITES APPLICATIONS FOR 15 VACANCIES UMG GH
Banking Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. స్పెషలిస్ట్‌లకు ఛాన్స్.. ఈ డీటైల్స్ ఫాలో అవ్వండి
స్పెషలిస్ట్ ఉద్యోగాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్.
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంకు 15 చార్టర్డ్ అకౌంటెంట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CA Specialist Officers) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యాంకు 15 చార్టర్డ్ అకౌంటెంట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (CA Specialist Officers) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక అప్లికేషన్ (Application) లింక్ అయిన https://smepaisa.bankofbaroda.co.in/BOBCAS/.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ సీఏ ఉద్యోగాల కోసం జూలై 19, 2022లోపు దరఖాస్తు చేసుకోవాలి. అఫీసియల్ నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తుదారులకు సంబంధిత విభాగాల్లో 6-8 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. అలాగే వయసు 28 నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలకు మీరు ఈ https://www.bankofbaroda.in/-/media/Project/BOB/CountryWebsites/India/Career/recruitment-of-ca-specialist-officers-29-06-2022-28-22.pdf లింక్‌ను విజిట్ చేయవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక జాబ్ నోటిఫికేషన్ ప్రకారం, సీఏ కేటగిరీలో సీనియర్ మేనేజర్-బిజినెస్ ఫైనాన్స్, చీఫ్ మేనేజర్-బిజినెస్ ఫైనాన్స్, సీనియర్ మేనేజర్-ఇంటర్నల్ కంట్రోల్స్, చీఫ్ మేనేజర్-ఇంటర్నల్ కంట్రోల్స్, సీనియర్ మేనేజర్-ఫైనాన్షియల్ అకౌంటింగ్, చీఫ్ మేనేజర్-ఫైనాన్షియల్ అకౌంటింగ్ వంటి 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతి పోస్ట్‌కి అర్హతలు స్పష్టంగా పేర్కొంది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు ఈ అర్హతలను ఒకసారి చెక్ చేయడం మంచిది.
1. అధికారిక వెబ్సైట్ bankofbaroda.co.inకి వెళ్లాలి.
2. హోమ్‌పేజీలో కెరీర్ (Career) ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
3. 'కరెంట్ ఓపెనింగ్స్' సెక్షన్లో 'చార్టర్డ్ అకౌంటెంట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్' అని ఉన్న అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
4. తరువాత 'అప్లై నౌ (Apply Now)' అనే లింక్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త లాగిన్/రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది.
5. మీ లాగిన్ క్రెడెన్షియల్స్ జనరేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేయాలి.
6. ఆ క్రెడెన్షియల్స్‌తో పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి. తరువాత BOB CA రిక్రూట్మెంట్ ఫారం 2022ని ఫిల్ చేయాలి.
7. అన్ని వివరాలను ఎంటర్ చేసి స్కాన్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
8. అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫారం సబ్మిట్ చేయాలి. ఆపై భవిష్యత్ కోసం ఆ ఫారాన్ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
అప్లికేషన్ ఫారంలో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌ను వెరిఫికేషన్ కోసం బ్యాంక్ అడగవచ్చు. అందుకే ఈ డాక్యుమెంట్స్‌ను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారిక బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ ప్రకారం, వివిధ పోస్టులకు నిర్ణయించిన విద్యార్హతలు అనేవి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్/ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందినవి/ ప్రభుత్వ నియంత్రణ సంస్థలు ఆమోదించినవి అయి ఉండాలి. అలానే బోర్డ్/ యూనివర్సిటీ/ రెగ్యులేటరీ బాడీ నుంచి సరైన డాక్యుమెంట్స్ ఉండాలి. దరఖాస్తు/ఇంటర్వ్యూ సమయంలో/బ్యాంక్ పిలిచినప్పుడు ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు ప్రాసెసింగ్ ఛార్జీలతో పాటు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. GEN/ OBC/EWS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600గా నిర్వహించారు. ST/SC/PWD/మహిళా అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.