బ్యాంక్ జాబ్ చేయాలనుకునేవారికి మరో గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా-BOB పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 8 ఉద్యోగాలున్నాయి. వేర్వేరు రంగాలకు చెందిన నిపుణుల్ని సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్ పోస్టుల్లో భర్తీ చేయనుంది బ్యాంక్ ఆఫ్ బరోడా. అభ్యర్థులకు ఆయా రంగాల్లో విద్యార్హతతో పాటు అనుభవం తప్పనిసరి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 10న ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 1 చివరి తేదీ. సెక్టార్ స్పెషలిస్ట్ కమ్ ప్రొడక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Bank of Baroda Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.