ఏటా చాలా మంది బ్యాంక్ జాబ్స్ (Bank Jobs) కి ప్రిపేర్ అవుతుంటారు. ఎంతో పక్క ప్రణాళికతో సిద్ధం అవుతుంటారు. ఈ ఏడాది కూడా పలు బ్యాంక్ పరీక్షలకు సంబంధించి క్యాలెండర్ కూడా వచ్చేసింది. జాబ్‌కి ప్రిపేర్ అయ్యేవారు ఈ క్యాలెండ్ ఆధారంగా టైం టేబుల్ రూపొందించుకొని చదివితే మంచి ఫలితాలను సాధించగలరు. న్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఈ ఏడాది నిర్వహించబోయే పరీక్షల వివరాలను వెల్లడించింది. ఈ ఏడాది రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబెషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది. మరి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఏ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? తెలుసుకోండి.
Career and Courses: సాఫ్ట్‌వేర్ జాబ్ ట్రై చేస్తున్నారా.. జాబ్స్ కోసం ఈ కోర్సులు ఉపయోగపడతాయి!
బ్యాంక్ పరీక్షల సమాచారం..
- ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ 2022 ఆగస్ట్ 7, 13, 14, 20, 21 తేదీల్లో జరుగుతాయి.
- ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్ 2022 సెప్టెంబర్ 24న, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్ 2022 సెప్టెంబర్ 24న, ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ 2022 అక్టోబర్ 1న జరగనుంది.
- ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ 2022 ఆగస్ట్ 28, సెప్టెంబర్ 3, 4 తేదీల్లో..
- ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ 2022 అక్టోబర్ 10న జరగనుంది.
- ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ 2022 అక్టోబర్ 15, 16, 22 తేదీల్ల..
- ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ 2022 నవంబర్ 26న జరగనుంది.
- ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ 2022 డిసెంబర్ 24, 31 తేదీల్లో..
- ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ 2023 జనవరి 29న జరగనుంది.
ఎలా ప్రిపేర్ అవ్వాలి..
- ముందు నుంచే ప్రిలిమ్స్, మెయిన్స్‌కు కలిసి ప్రిపేర్ అవ్వాలి.
- సన్నద్ధతకు రోజు కనీసం 6 నుంచి 10 గంటల సమయం కేటాయించాలి.
- మొత్తం ఒకే సబ్జెక్టు చదవకుండా.. వాటిని విభజించుకోవాలి.
Top Career Options: బెస్ట్ కెరీర్ ఎంచుకోవాలనుకొంటున్నారా.. అయితే టాప్ ప్రొఫెషన్స్ వివరాలు!
- మీకు కఠినమైన సబ్జెక్టుకు కనీసం 2 గంటల సమయం ఎక్కువగా కేటాయించాలి.
- కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించేవారు కూడా భయపడక్కర్లేదు 20 నుంచి 25 రోజుల్లో కృషి చేస్తే సబ్జెక్టుపై పట్టు సాదించవచ్చు.
- ముందు ప్రిపరేషన్‌లో కచ్చితత్వం (Accuracy) అభ్యాసం చేయాలి.
- కచ్చితత్వం అనంతరం వేగం పెంచాలి.
- సబ్జెక్టు మాత్రమే కాకుండా రోజు మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి.
పరీక్షలో ఏం వస్తాయి.. ఎం చదవాలి
బ్యాంక్ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముందుగా ప్రతీ విభాగంలో పాస్ అయ్యేలా ప్రిపేర్ అవ్వాలి. మూడు విభాగాల్లో కనీస మార్కులు వచ్చిన వారివి మాత్రమే మెరిట్ స్కోర్‌ను పరిగనిస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Exam Tips, Govt Jobs 2022