హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Bank Jobs: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. ప్ర‌ముఖ బ్యాంక్‌లో డిగ్రీ అర్హ‌త‌తో 312 ఎస్ఓ జాబ్స్‌.. అప్లికేష‌న్ వివ‌రాలు

Bank Jobs: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. ప్ర‌ముఖ బ్యాంక్‌లో డిగ్రీ అర్హ‌త‌తో 312 ఎస్ఓ జాబ్స్‌.. అప్లికేష‌న్ వివ‌రాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Indian Bank SO Recruitment 2022 | ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి 312 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.indianbank.in/career/ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇంకా చదవండి ...

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి 312 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://www.indianbank.in/career/ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ద‌ర‌ఖాస్తు లింక్ మే 24, 2022 నుంచి జూన్ 14, 2022 వ‌ర‌కు తెరిచి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5, గ్రూప్ -6 మరియు గ్రూప్ 7 కింద సీనియర్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మరియు చీఫ్ మేనేజర్‌గా నియమిస్తారు. ఫ్రెషర్స్ అయిన అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు, అనుభవం ఉన్న ఇతర అభ్యర్థులు సీనియర్ మేనేజర్, మేనేజర్ మరియు చీఫ్ మేనేజర్ పోస్టులకు అర్హులు.

University of Arizona: మెషిన్ లెర్నింగ్‌పై ఆన్‌లైన్ ఎంఎస్ ప్రోగ్రామ్‌.. తాజాగా లాంచ్ చేసిన అరిజోనా యూనివర్సిటీ

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం 24/05/2022

దరఖాస్తు నమోదు ముగింపు 14/06/2022

అప్లికేషన్ వివరాలను సవరించడానికి ముగింపు 14/06/2022

దరఖాస్తు ప్రింట్‌కు అవ‌కాశం 29/06/2022

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు 24/05/2022 నుంచి 14/06/2022 వరకు

IIM Udaipur: బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌.. ఐఐఎం ఉదయ్‌పూర్‌లో స్పెషల్ కోర్సు!

ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.

Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.indianbank.in/career/ ను సంద‌ర్శించాలి.

Step 3 - అందులో నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

JEE Preparation: జేఈఈలో బెస్ట్ స్కోర్‌తో ఉత్తీర్ణ‌త సాధించాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Step 4 - అనంత‌రం Recruitment of Specialist Officers 2022 విభాగంలో Click here for Registration ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.

Step 5 - కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో Click here for New Registration ఆప్ష‌న్‌లోకి వెళ్లాలి.

Step 5 - పేరు, ఈమెయిల్‌, మొబైల్ నంబ‌ర్ వివ‌రాల‌తో ప్రాథ‌మికంగా రిజిస్ట్రేష‌న్ పూర్తి చేయాలి.

Step 6 - అనంత‌రం పాస్‌వ‌ర్డ్‌, రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ ఫోన్‌కు, మొబైల్‌కు వ‌స్తుంది.

Step 7 - అనంత‌రం వాటితో లాగిన్ అవ్వాలి. విద్యా, అనుభ‌వం వివ‌రాలు త‌ప్పులు లేకుండా న‌మోదు చేయాలి.

Step 8 - త‌రువాత జ‌న‌ర‌ల్, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ ఇత‌ర‌ అభ్య‌ర్థులు రూ.850 ఫీజు, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు రూ.175 ఫీజు చెల్లించాలి.

Step 9 - అనంత‌రం అప్లికేష‌న్ స‌బ్‌మిట్ చేయాలి. భ‌విష్య‌త్ అవ‌స‌రాల కోసం ద‌ర‌ఖాస్తు ఫాంను ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి.

Step 10 - ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్ప‌ణ‌కు జూన్ 14, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

First published:

Tags: Bank Jobs, Govt Jobs 2022, Job notification, JOBS

ఉత్తమ కథలు