బ్యాంక్ ఉద్యోగాల (Bank Jobs) కోసం ఎదురు చూస్తున్నారా? అయితే.. మీకు అదిరిపోయే శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 1,172 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లను విడుదల చేసింది బ్యాంక్. మొత్తం ఖాళీల్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు 136 ఉండగా.. ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్టు) ఉద్యోగాలు మరో 1036 ఉన్నాయి.
స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు: ఈ విభాగంలో మొత్తం 136 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 84 మేనేజర్ పోస్టులు, 46 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, 6 డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 1 నుంచి ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
బ్యాంక్ అధికారిక వెబ్ సైట్: https://www.idbibank.in/
ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్టు) ఉద్యోగాలు: ఈ విభాగంలో మొత్తం 1036 ఖాళీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 24న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపకైన అభ్యర్థులు ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన పని చేయాల్సి ఉంటుంది. అనంతరం వారి పనితీరు ఆధారంగా సర్వీసు పొడిగింపు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.