హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS Preparation Tips: బ్యాంక్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి అలర్ట్.. ఈ ప్రిపరేషన్ టిప్స్ మీ కోసమే..

IBPS Preparation Tips: బ్యాంక్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారికి అలర్ట్.. ఈ ప్రిపరేషన్ టిప్స్ మీ కోసమే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చిన్ననాటి నుంచి మనం నేర్చుకున్న ఇంగ్లీష్ గ్రామర్ నే బ్యాంక్ ఎగ్జామ్స్ లో  ఎక్కువగా అడుగుతూ ఉంటారు. బ్యాంక్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ప్రిపరేషన్ టిప్స్ ఇలా ఉన్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రచయిత: శ్రీనివాస్, ఆప్టిట్యూడ్ అధ్యాపకులు, ఎమరాల్డ్స్ కాలేజీ, తిరుపతి

  (GT Hemanth Kumar, News18, Tirupati)


  చిన్ననాటి నుంచి మనం నేర్చుకున్న ఇంగ్లీష్ గ్రామర్ నే బ్యాంక్ ఎగ్జామ్స్ (Bank Exams) లో  ఎక్కువగా అడుగుతూ ఉంటారు. టెన్సెస్, పార్ట్స్ అఫ్ స్పీచ్, కంప్రెసివ్ టెస్ట్ కావచ్చు ఏదైనా అదే సిలబస్ ఉంటుంది. antonyms, synonyms ను ఐదు మార్కులకు ఇవ్వడం ఖాయం.  కొంచం చొరవ చూపకపోతే ఇంగ్లీష్ లో మంచి మార్కులు సాధించడం కష్టం అవుతుంది. ఇలానే చాలా మంది సెక్షనల్ కట్ అఫ్ రీచ్ అవ్వలేక పోతున్నారు. ముఖ్యంగా శ్రద్ధ పెట్టి చదివితే కచ్చితంగా ఇంగ్లీష్ లో మంచి మార్కులు సాధించడం ముఖ్యం. vocabulary బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉటుంది. ఎర్రర్స్ సంబంధించిన రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాలి. ఇంగ్లీష్ కు సంభందించి 120 రూల్స్ ఉంటాయి. వాటిని పూర్తిగా నేర్చుకోవాలి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో నాలుగు అంశాలు ప్రధానమైనవి. అందులో ఒకటి గ్రామర్, రెండవది ఒకబిలరీ, మూడవది రీడింగ్, నాల్గవదీ లాజిక్. ఈ నాలుగు విభాగాలను ఇంగ్లీష్ లో ఫోకస్ చేయడం ద్వారా బ్యాంక్ పరీక్షలు ఏవైనా మంచి మార్కులు మీ సొంతం.

  బ్యాంకింగ్ పరీక్ష (Bank Exams) రాసే అభ్యర్థులు కష్టంగా భావించేది ఇంగ్లీష్ మాత్రమే. మిగిలిన సిబ్జెక్టులలో లాగా షార్ట్ కట్స్ ఇంగ్లీష్ కి ఉండదు. మూడువేల కొత్త పదాలు నేర్చుకోవడం ద్వారా vocabulary చాల ఈజీగా సాల్వ్ చేయవచ్చు. బట్టి కొట్టే మెథడ్ కి వెళ్ళే తప్పు చేసినట్లే అవుతుంది. చదువుకోవడం ద్వారా కొత్త కొత్త పదాలు అందుబాటులోకి వస్తాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అడుగుతూ ఉంటారు. ఫిల్లింగ్ ది బ్లాంక్స్ అడుగుతున్నారు. కొత్తగా వార్డ్ రీప్లేస్ మెంట్ అడుగుతున్నారు. మరియు మ్యాచ్ ది కాలమ్స్ అనే ప్రశ్నలు అడుగుతున్నారు. ఇలాంటి కొత్త కొత్త టాపిక్స్ సిలబస్ లో చేర్చడం జరిగింది. చాలా మంది vocabulary సాల్వ్ చేయలేక ఫెయిల్ అవుతూ ఉంటారు.

  IBPS Clerk Exam: మీరు బ్యాంక్ ఉద్యోగమే లక్ష్యంగా సిద్దం అవుతున్నారా? ఇలా ప్రిపేర్ అయ్యారంటే అలా జాబ్ వచ్చేస్తుంది !

  లిమిటెడ్ పార్ట్ అఫ్ vocabulary రావడమే ఇందుకు ప్రధాన కారణం. చిన్నప్పటి నుంచి గ్రామర్ ను చదువుతూనే ఉన్నాం. పార్ట్స్ అఫ్ స్పీచ్, టెన్సెస్, ప్యాసివ్ వాయిస్, రిపోర్టడ్ స్పీచ్, ఆర్టికల్స్ తదితర టాపిక్స్ ను బాగా నేర్చుకోవాలి. ఇంగ్లిష్ న్యూస్ పేపర్ చదవడం ద్వారా vocabulary తో పాటుగా రీడింగ్ కాన్సెప్ట్ ఫుల్ ఫిల్ చేయగలరు. రోజుకి రెండు గంటల సమయం న్యూస్ పేపర్ చదవడం ద్వారా జనరల్ నాలెడ్జ్, న్యూ వర్డ్స్ ఐడెంటిఫికేషన్ వస్తుంది.

  ప్రతీ పేరాలో వచ్చిన డిఫికల్ట్ వార్డ్ ను అనలైజ్ చేసి... అండర్ లైన్ చేసుకోవాలి. డిక్షనరీ ద్వారా అర్థాలు వాటి తెలుసుకొని సాధన చేయాలి. లాజిక్స్ లో ముఖ్యంగా పారాగ్రాఫ్ జంబుల్ అడుగుతున్నారు. పేరాగ్రాఫ్ ను జుంబుల్ చేసి ఇస్తారు. వాటిని మనం అర్థం వచ్చే పేరాగ్రాఫ్ లా మార్చాలి. దీనికి ముఖ్యంగా లాజికల్ థీరీ అవసరం ఉంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Bank Jobs, IBPS, Job notification, JOBS

  ఉత్తమ కథలు