Home /News /jobs /

BANK JOBS 2022 APPLY FOR VARIOUS POSTS IN NHB LAST DATE 22 AUGUST KNOW FULL DETAILS FO RECRUITMENT VB

NHB Recruitment 2022: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో ఖాళీలు.. ఏదైనా డిగ్రీ, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు..

NHB Recruitment 2022: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో ఖాళీలు.. ఏదైనా డిగ్రీ, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు..

NHB Recruitment 2022: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో ఖాళీలు.. ఏదైనా డిగ్రీ, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు..

NHB Recruitment 2022: బ్యాంక్‌లో పని చేయాలనుకునే అభ్యర్థుల కోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
బ్యాంక్‌లో (Bank) పని చేయాలనుకునే అభ్యర్థుల కోసం నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (National Housing Bank)పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nhb.org.in సందర్శించడం ద్వారా దరఖాస్తు(Application) చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు(Recruitment Drive) దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 22. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 14 పోస్టులను భర్తీ చేస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

New Business Idea: ప్రతి నెలా రూ. లక్ష సంపాదన.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. ఆ బిజినెస్ ఏంటంటే..


ఖాళీల వివరాలు ఇలా .. 

ఇందులో చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అండ్ ఆఫీసర్ ఫర్ సూపర్‌విజన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.



విద్యార్హతలు
అభ్యర్థి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ/ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ/ ఇంజినీరింగ్‌లో మాస్టర్ డిగ్రీ/ సీఏ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కలిగి ఉండాలి.

వయో పరిమితి..
అభ్యర్థి వయస్సు 40 నుండి 57 సంవత్సరాల మధ్య ఉండాలి. మరికొన్ని పోస్టులకు 57 నుంచి 63 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ..
NHB ఎంపిక షార్ట్‌లిస్టింగ్ & ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

అప్లికేషన్ మోడ్..
ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించడబడతాయి.. దాని కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nhb.org.in కి వెళ్లాలి.

-అక్కడ కెరీర్ అప్షన్ పై క్లిక్ ఇవ్వాలి. దాని కోసం డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు.

-దరఖాస్తులను సమర్పించడానికి అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దరఖాస్తు ఫీజును చెల్లించాలి. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.850 గా నిర్ణయించారు. రిజర్వేషన్ అభ్యర్థులు రూ.150 చెల్లిస్తే సరిపోతుంది.

-తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ అయి వివరాలను నమోదు చేయాలి.

-తర్వాత సబ్ మిట్ చేసిన దరఖాస్తును ప్రింట్ తీసుకోవాలి. దానిని భవిష్యత్ అవసరాల కొరకు దాచుకోవాలి.
Published by:Veera Babu
First published:

Tags: Bank Jobs, Career and Courses, Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు