Home /News /jobs /

BAGLESS SCHOOL DAYS INTERNSHIP FOR STUDENTS EDUCATION MINISTER ANNOUNCES VARIOUS INITIATIVES UNDER NEP 2020 MK GH

NEP 2020: ఇకపై విద్యార్థులకు బ్యాగ్‌లెస్ స్కూల్ డేస్, ఇంటర్న్‌షిప్‌లు.. ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మోదీ ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ 2020) విజయవంతంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్‌ఈపీ- 2020 కింద బ్యాగ్‌లెస్ స్కూల్ డేస్, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ కమిషన్ వంటి కొన్ని సంస్కరణలను అమలు చేయనున్నామని ప్రకటించారు.

ఇంకా చదవండి ...
మోదీ ప్రభుత్వం కొత్త జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ 2020) విజయవంతంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్‌ఈపీ- 2020 కింద బ్యాగ్‌లెస్ స్కూల్ డేస్, విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ కమిషన్ వంటి కొన్ని సంస్కరణలను అమలు చేయనున్నామని ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తాజాగా జరిగిన క్యాబినెట్ కాన్ఫరెన్స్‌లో మంత్రి జాతీయ విద్యా విధానంపై మాట్లాడారు. అలాగే యువజన సంక్షేమ వ్యవస్థపై కూడా చర్చించారు. భారత విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు త్వరలోనే అమలు చేయనున్న కొన్ని ప్రణాళికలను ప్రకటించారు. అవేంటో చూద్దాం.

ఎన్‌ఈపీ 2020: విద్యాశాఖ మంత్రి ప్రకటించిన ప్రణాళికలు..

1. ప్రభుత్వం చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది.

2. ప్రభుత్వం నూతన విద్యా విధానం ద్వారా బ్యాగ్‌లెస్ స్కూల్ డేస్ ప్రవేశపెట్టబోతుంది. దీంతో ఇకపై విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు స్కూల్ బ్యాగ్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, పుస్తకాలతో పని లేకుండా పాఠాలు నేర్చుకోవచ్చు.

3. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్లే క్లాస్, ప్రీ- ప్రైమరీ విభాగాలు తీసుకురానున్నారు.

4. విద్యార్థులను 10 రోజుల పాటు ఇంటర్న్‌షిప్‌కు పంపించడం వంటి కార్యక్రమాలను అదనపు పాఠ్యాంశాలలో చేరుస్తుంది.

5. శారీరక వికలాంగ బాలికలకు ఇచ్చే ప్రోత్సాహకాలను రూ.2000కు పెంచనున్నారు.

విద్యార్థుల సృజనాత్మక సామర్థ్యం పెరిగేలా నూతన విద్యా విధాన్నాన్ని రూపొందించారు. విద్యార్థుల నివాస స్థలాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించడమే ఎన్‌ఈపీ 2020 ప్రధాన లక్ష్యం. అలాగే సమాజంలో చాలాకాలంగా వెనుకబడిన వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉత్తమ విద్యను అందించడమే ఎన్‌ఈపీ 2020 ముఖ్య లక్ష్యం. పెరుగుతున్న కాంపిటీషన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకు వస్తున్నారు. భారతదేశం కూడా విద్యార్థులకు మంచి విద్య, ఉద్యోగ అవకాశాలు లభించేలా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది.

విద్యార్థుల భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు విద్యావ్యవస్థను బలపరచాలని మోదీ సర్కార్ భావించింది. దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారిన సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు కేంద్రం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Exams

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు