హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AISHE Report: డిగ్రీలో బీఏ, పీజీలో సోషల్ సైన్స్.. ఈ కోర్సులకు ఫుల్ డిమాండ్.. ఆ లెక్కలివే!

AISHE Report: డిగ్రీలో బీఏ, పీజీలో సోషల్ సైన్స్.. ఈ కోర్సులకు ఫుల్ డిమాండ్.. ఆ లెక్కలివే!

AISHE Report: డిగ్రీలో బీఏ, పీజీలో సోషల్ సైన్స్.. ఈ కోర్సులకు ఫుల్ డిమాండ్.. ఆ లెక్కలివే!

AISHE Report: డిగ్రీలో బీఏ, పీజీలో సోషల్ సైన్స్.. ఈ కోర్సులకు ఫుల్ డిమాండ్.. ఆ లెక్కలివే!

AISHE Report: 2020-21 అకడమిక్ ఇయర్ వివరాలను ఆలిండియా సర్వే ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) వెల్లడించింది. దేశంలో డిగ్రీ, పీజీ స్థాయిలో ఎలాంటి కోర్సులకు డిమాండ్ ఉందనే వివరాలను ఈ రిపోర్ట్ వెల్లడించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్ర విద్యా శాఖ 2011 నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్‌ (Higher Education)పై ఆలిండియా (All స్థాయిలో సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా దేశంలోని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌లలో వివిధ కోర్సుల్లో విద్యార్థుల ఎన్ రోల్‌మెంట్, ఉపాధ్యాయుల డేటా, మౌలిక సదుపాయాలు, ఆర్థిక స్థితిగతులపై వివరణాత్మక సమాచారాన్ని అందిస్తోంది. తాజాగా 2020-21 అకడమిక్ ఇయర్ వివరాలను ఆలిండియా సర్వే ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) వెల్లడించింది. దేశంలో డిగ్రీ, పీజీ స్థాయిలో ఎలాంటి కోర్సులకు డిమాండ్ ఉందనే వివరాలను ఈ రిపోర్ట్ వెల్లడించింది.

* బీఏ కోర్సులకు ఎక్కువ డిమాండ్

ఆల్ ఇండియా సర్వే ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) 2020-21 ప్రకారం.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా అత్యధికంగా 1.04 కోట్ల మంది విద్యార్థుల బీఏ కోర్సుల్లో ఎన్‌రోల్ అయ్యారు. వీరిలో 52.7 శాతం మంది బాలికలు కాగా, మిగతా 47.3 శాతం మంది బాలురని సర్వే వెల్లడించింది. తర్వాతి స్థానంలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc) కోర్సులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 49.12 లక్షల మంది విద్యార్థులు బీఎస్సీ కోర్సుల్లో జాయిన్ అయ్యారు.

* బీటెక్‌‌‌లో 23.20 లక్షల విద్యార్థులు

2020-21లో దేశవ్యాప్తంగా బీటెక్‌ కోసం 23.20 లక్షల మంది విద్యార్థులు ఎన్‌రోల్ చేసుకున్నారు. అయితే వారిలో మహిళలు కేవలం 28.7 శాతంగా ఉన్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (బీఈ)లో 13.42 లక్షల మంది విద్యార్థులు చేరారు. వారిలో 28.5 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc)కోర్సుల్లో 49.12 లక్షల మంది విద్యార్థులు చేరారు. వారిలో 52.2 శాతం మంది బాలికలు ఉన్నారు. ఇక బీకామ్‌లో దేశవ్యాప్తంగా 43.22 లక్షల మంది విద్యార్థులు చేరారు. వారిలో 48.5 శాతం మంది బాలికలు ఉన్నారు.

* పీహెచ్‌డీ లెవల్లో ఇలా...

పీహెచ్‌డీ స్థాయిలో ఇంజనీరింగ్, టెక్నాలజీ స్ట్రీమ్‌ల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ స్ట్రీమ్‌ను 21 సబ్ స్ట్రీమ్‌లుగా విభజించారు. మొత్తం 56,625 మంది విద్యార్థులు పీహెచ్‌డీ కోసం ఎన్‌రోల్ అయ్యారు. వీరిలో 33.3 శాతం మంది మహిళలు ఉన్నారు. పీహెచ్‌డీ కోసం సైన్స్ స్ట్రీమ్‌లో 48,600 మంది విద్యార్థులు చేరారు. వీరిలో 48.8 శాతం మంది మహిళలు ఉన్నారు. సైన్స్ స్ట్రీమ్ గణితం, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ వంటి 17 సబ్ స్ట్రీమ్‌లుగా విభజించారు.

STEMలో సైన్స్ స్ట్రీమ్ (గణితంతో సహా), ఇంజనీరింగ్ & టెక్నాలజీ స్ట్రీమ్ ఉన్నాయి. STEM (యూజీ, పీజీ, ఎంఫీల్, పీహెచ్‌డీ)కోసం 94.69 లక్షల మంది అభ్యర్థులు ఎన్‌రోల్ అయ్యారు. వీరిలో 53.74 లక్షల మంది పురుష అభ్యర్థులైతే, మహిళా అభ్యర్థులు 40.94 లక్షలుగా ఉన్నారు.

ఇది కూడా చదవండి : సమయం లేదు మిత్రమా.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో లేదో చెక్ చేయండి..!

* పీజీ సైన్స్ స్ట్రీమ్‌లో మహిళలు ఎక్కువ

పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సోషల్ సైన్స్ స్ట్రీమ్‌లో ఎక్కువ మంది విద్యార్థులు చేరారు. మొత్తంగా 9.41 లక్షల మంది విద్యార్థులు ఎన్ రోల్ చేసుకోగా, వీరిలో 56.5 శాతం మంది బాలికలు ఉన్నారు. తర్వాతి స్థానంలో సైన్స్ స్ట్రీమ్‌ నిలిచింది. సైన్స్ స్ట్రీమ్‌లో మొత్తంగా 6,79,178 మంది విద్యార్థులు చేరగా, వీరిలో 61.3 శాతం మంది మహిళా విద్యార్థులు ఉన్నారు. మేనేజ్‌మెంట్ స్ట్రీమ్‌లో 6,86,001 మంది విద్యార్థులు పీజీలో చేరారు. వీరిలో 43.1 శాతం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

* ఎడ్యుకేషన్ స్ట్రీమ్‌లో 64.4 శాతం మహిళలు

పీజీ స్థాయిలో కామర్స్ స్ట్రీమ్‌లో 5.36 లక్షల మంది విద్యార్థులు చేరగా, వీరిలో 66.5 శాతం మంది మహిళా విద్యార్థులు ఉన్నారు. 12 సబ్ స్ట్రీమ్‌లుగా విభజించబడిన భారతీయ భాషల్లో 3.20 లక్షల మంది విద్యార్థులు పీజీలో చేరారు. ఎడ్యుకేషన్ స్ట్రీమ్‌లో చేరిన విద్యార్థుల సంఖ్య 2.06 లక్షలు కాగా, ఇందులో 64.4 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం.

First published:

Tags: Career and Courses, Degree courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు