మొదటి ఉద్యోగంతో రూ.42 లక్షల ప్యాకేజీ... బీటెక్ విద్యార్థిని సంచలనం

హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఆమెకు పోస్టింగ్ లభించింది. ఈ ఆఫర్ రావడం కన్నా ముందే మైక్రోసాఫ్ట్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసింది తాన్యా అరోరా.

news18-telugu
Updated: October 23, 2019, 3:11 PM IST
మొదటి ఉద్యోగంతో రూ.42 లక్షల ప్యాకేజీ... బీటెక్ విద్యార్థిని సంచలనం
మొదటి ఉద్యోగంతో రూ.42 లక్షల ప్యాకేజీ... బీటెక్ విద్యార్థిని సంచలనం (Tanya Arora File Photo: )
  • Share this:
తాన్యా అరోరా... బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈ అమ్మాయి పేరు ఇప్పుడు ఓ సంచలనం. ఇందుకు కారణం ఆమె సాధించిన ఘనతే. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్న తాన్యా అరోరా మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం సంపాదించింది. జీతం ఎంతో తెలుసా? ఏడాదికి రూ.42 లక్షలు. 2019లో ఓ ఇంజనీరింగ్ ఫ్రెషర్‌కు ఓ కంపెనీ ఆఫర్ చేసిన భారీ వేతనం ఇదే. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఆమెకు పోస్టింగ్ లభించింది. ఈ ఆఫర్ రావడం కన్నా ముందే మైక్రోసాఫ్ట్‌లో సమ్మర్ ఇంటర్న్‌షిప్ చేసింది తాన్యా అరోరా. మైక్రోసాఫ్ట్‌లో పనిచేయడం సంతోషంగా ఉందని, తన కల నిజమైందని తాన్యా అరోరా తన ఆనందాన్ని పంచుకుంది.నాకు టెక్నాలజీపై అమితాసక్తి ఉంది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ లాంటి అంశాల్లో నైపుణ్యం సాధించడానికి చాలా కష్టపడ్డాను. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో తోటి విద్యార్థులు, టెక్నాలజీ నిపుణుల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ప్రతీ అడుగులో నాకు తోడుగా నిలిచిన ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు.
తాన్యా అరోరా, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి మంచి పేరుంది. గత మూడేళ్లలో ఇలాంటి రికార్డ్ ప్లేస్‌మెంట్స్‌తో ఈ యూనివర్సిటీ పేరు తెచ్చుకుంది. ఈ యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు హెచ్‌పీ, అమెజాన్, యాహూ, సిస్కో, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, అమెజాన్ లాంటి ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండిఇవి కూడా చదవండి:

SSC CGL Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి డిగ్రీ చాలు... నోటిఫికేషన్ వివరాలివే

Post Office Jobs: పోస్ట్ ఆఫీస్‌లో 5,476 జాబ్స్... అప్లై చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి

Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివే
First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading