• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • AYUSHMAN MITRA BHARTI 2020 RECRUITMENT NOTIFICATION IS FAKE CLARIFIES NATIONAL HEALTH AUTHORITY SS

Fake Jobs: ఆ జాబ్ నోటిఫికేషన్ ఫేక్... క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Fake Jobs: ఆ జాబ్ నోటిఫికేషన్ ఫేక్... క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

Fake Jobs: ఆ జాబ్ నోటిఫికేషన్ ఫేక్... క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం (ప్రతీకాత్మక చిత్రం)

Fake Jobs | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పేరుతో మీరు ఏదైనా నోటిఫికేషన్ చూశారా? అందులో ఓ నోటిఫికేషన్ ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 1,12,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని, దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. వందలు, వేలు కాదు... ఏకంగా లక్షకు పైగా పోస్టులు కావడం, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. కానీ అది ఫేక్ జాబ్ నోటిఫికేషన్ అని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 'ఆయుష్మాన్ మిత్ర భారతి 2020' లో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోందన్నది ఆ నోటిఫికేషన్ సారాంశం. 1,12,000 పోస్టులతో నోటిఫికేషన్ అని ప్రచారం జరుగుతుండటంతో నిరుద్యోగులు ఎక్కువమంది ఈ నోటిఫికేషన్‌ను నమ్మే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన నేషనల్ హెల్త్ ఆథారిటీ దీనిపై వివరణ ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని స్పష్టం చేసింది. వాట్సప్, ఎస్ఎంఎస్, కాల్స్, ఇమెయిల్స్, వెబ్ పోర్టల్స్, వీడియోల్లో ఉద్యోగ ప్రకటనల పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని, ఇలాంటి తప్పుడు ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

    SBI PO recruitment 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 2000 ఉద్యోగాలు... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    Coast Guard Jobs 2020: టెన్త్ పాసైనవారికి ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు


    ఏవైనా ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన-PMJAY అధికారిక వెబ్‌సైట్ https://pmjay.gov.in/ ఫాలో కావాలి. ఉద్యోగాల పేరుతో నకిలీ నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం మాత్రమే కాదు ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పేరుతో నకిలీ వెబ్‌సైట్స్ చాలానే ఉన్నాయి. వాటిని పట్టించుకోవద్దని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. గూగుల్ ప్లేస్టోర్‌లో నేషనల్ హెల్త్ ఆథారిటీ పేరుతో ఫేక్ యాప్స్ కూడా ఉన్నాయి. నకిలీ వెబ్‌సైట్స్, యాప్స్ జాబితాను రిలీజ్ చేసింది నేషనల్ హెల్త్ ఆథారిటీ. ఆ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Jobs: విశాఖపట్నంలోని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Indian Railways: రైల్వే ఉద్యోగం కోరుకునేవారికి కొత్త కోర్సులు ప్రకటించిన ఇండియన్ రైల్వేస్

    ఉద్యోగాల పేరుతో, ప్రభుత్వ పథకాల పేరుతో మోసం చేసే వ్యక్తులు, సంస్థలు ఇలాంటి ప్రకటనలు జారీ చేస్తూ ఉంటారు. వాటిని నమ్మి మోసపోకూడదు. జాబ్ నోటిఫికేషన్లు, లేదా స్కీమ్స్ వివరాలను అధికారిక వెబ్‌సైట్లలోనే తెలుసుకోవాలి. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన పేరుతో ఉద్యోగాలు, ఇతర పథకాల పేరుతో ఎవరైనా మోసాలు చేస్తున్నట్టు మీ దృష్టికి వస్తే Shri B K Datta, General Manager, National Health Authority, 9th Floor, Tower 1, Jeevan
    Bharti Building, Connaught Place, New Delhi – 110001 అడ్రస్ లేదా bk.datta@nic.in మెయిల్ ఐడీకి వివరాలను పంపాలి.
    Published by:Santhosh Kumar S
    First published: