ఆయుర్వేద (Ayurveda), సిద్ధ, యునాని, హోమియోపతి (Homeopathy) కోర్సుల కౌన్సెలింగ్ కోసం కొత్త కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌ను ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (ఏఏసీసీసీ) శుక్రవారం లాంచ్ చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం accc.gov.in అనే కొత్త కౌన్సెలింగ్ వెబ్‌సైట్‌ను తీసుకొచ్చినట్లు ఏఏసీసీసీ తాజాగా వెల్లడించింది. నీట్ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BHMS), బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ (BUMS), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద, మెడిసిన్ అండ్ సర్జరీ (BAMS) కోర్సులతో సహా వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు accc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ వెబ్సైట్లోనే ఆయుష్ నీట్ కౌన్సెలింగ్ షెడ్యూల్, ఇన్ఫర్మేషన్ విండో వంటి ఇతర వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఆయుష్ కౌన్సెలింగ్ ద్వారా అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ (Central Government University) లతో సహా ఇతర యూనివర్సిటీలు, కాలేజీల్లో మొత్తం 52,720 అడ్మిషన్లను పొందవచ్చు. 15% ప్రభుత్వ, ప్రభుత్వ-సహకార సంస్థల్లో ప్రవేశాలకు ఆయుష్ యూజీ కోర్సుల కౌన్సెలింగ్ (Counseling) జరుగుతుంది. ఆయుష్ నీట్ కౌన్సెలింగ్ 2021 ఇంకా ప్రారంభం కాలేదు. ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (AACCC) త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. అయితే కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రారంభం కాగానే కొత్తగా లాంచ్ చేసిన వెబ్సైట్ ద్వారా ఎలా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయుష్ నీట్ 2021 కౌన్సెలింగ్ దరఖాస్తు ప్రక్రియ..
Step 1 : ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి లేదా aaccc.gov.in క్లిక్ చేయండి.
Step 2: 'న్యూ రిజిస్ట్రేషన్' ట్యాబ్‌పై నొక్కండి.
Step 3: ఫారమ్‌లో అకడమిక్, పర్సనల్, కాంటాక్ట్ ఇంకా ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి.
Corona Cases in India: స్కూల్లో కరోనా కలకల.. 16మంది విద్యార్థులకు కోవిడ్
Step 4: మీకు నచ్చిన కాలేజీలు, కోర్సుల ఆప్షన్ ను ఎంచుకోండి.
Step 5: రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి.
ఆయుష్ నీట్ 2021 కౌన్సెలింగ్ కు కావాల్సిన డాక్యుమెంట్లు..
1. నీట్ అడ్మిట్ కార్డ్
2. నీట్ ర్యాంక్ లెటర్
3. 10వ తరగతి పాస్ సర్టిఫికేట్
4. క్లాస్ 12 పాస్ సర్టిఫికేట్
5. ప్రభుత్వ ఫోటో ఐడీ
6. పాస్‌పోర్ట్ సైజు ఫోటో
RRB Group D: ఆర్ఆర్బీ గ్రూప్ డీ అప్లికేషన్ లింక్ యాక్టివేట్.. ఎలా ఎడిట్ చేయాలో తెలుసుకోండి!
7. క్యాస్ట్ సర్టిఫికెట్
కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తరఫున ఏఏసీసీసీ నీట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా గవర్నమెంట్, గవర్నమెంట్ సహకార మెడికల్ కాలేజీలు, సెంటర్ యూనివర్సిటీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ లలో ప్రవేశాలను ఏఏసీసీసీ కల్పిస్తుంది. అభ్యర్థులు కౌన్సిలింగ్ దరఖాస్తు సమయంలో నాన్-రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థిని సెకండ్ రౌండులో తమకు కేటాయించిన సీటు నుంచి తప్పుకోవాలని అనుకున్నట్లయితే సెక్యూరిటీ డిపాజిట్ (Security Deposit) అనేది తిరిగి ఇవ్వరు. థర్డ్ రౌండులో తమకు కేటాయించిన సీట్లలో జాయిన్ కాకపోయినా అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayurveda, Medical colleges, NEET, NEET 2021