AXIS BANK INVITES APPLICATIONS FOR AXIS BANK YOUNG BANKERS PROGRAM ABYBP SS
Axis Bank: ఈ కోర్సు చేస్తే యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగం గ్యారెంటీ
Axis Bank: ఈ కోర్సు చేస్తే యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగం గ్యారెంటీ
(ప్రతీకాత్మక చిత్రం)
Axis Bank Young Bankers Program | బ్యాంకు ఉద్యోగం మీ కలా? మంచి కోర్సు చేసి బ్యాంకులో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? మీలాంటి వారికోసం యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ ప్రకటించింది యాక్సిస్ బ్యాంక్.
యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. బెంగళూరులోని మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్, నోయిడాలోని ఎమిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ ఒప్పందం కుదుర్చుకొని యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్-ABYBP అందిస్తోంది. ఇది ఫుల్ టైమ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఎంపికైనవారికి ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. ప్రొఫెషనల్ కమ్యూనికేషన్, బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్, ట్రేడ్ ఫైనాన్స్, బ్యాంకింగ్ అల్లైజడ్ సర్వీసెస్, సేల్స్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ వెల్త్ మేనేజ్మెంట్, రీటైల్ బ్యాంకింగ్ సేల్స్, డిజిటల్ బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్ లాంటి అంశాల్లో శిక్షణ లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ సర్వీసెస్ సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం పొందే అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎంబీఏ ప్రోగ్రామ్‌లతో పోలిస్తే యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్‌తో త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందని యాక్సిస్ బ్యాంక్ చెబుతోంది.
ABYBP 2020: నోటిఫికేషన్ వివరాలివే...
శిక్షణ కాలం- ఒక సంవత్సరం
వయస్సు- నాటికి 21 నుంచి 30 ఏళ్లు (1990 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత జన్మించినవారు అర్హులు)
విద్యార్హత- గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ దరఖాస్తు చేయొచ్చు. చివరి సంవత్సరంలో 50% మార్కులతో పాస్ కావాలి. లేదా కోర్సు మొత్తం 50% మార్కులతో పాస్ కావాలి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు. వారు ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైతే 2020 జూన్ లోగా డిగ్రీ సర్టిఫికెట్, మార్క్స్ షీట్ సమర్పించాలి.
ప్లేస్మెంట్- కోర్సు ప్రారంభం కాగానే ప్రొవిజనల్ అపాయింట్ ఇస్తారు. కోర్సు పూర్తైన తర్వాత ఉద్యోగం కల్పిస్తారు.
కోర్సు ఫీజు- రూ.3.29 లక్షలు+ట్యాక్స్
ఎడ్యుకేషన్ లోన్- కోర్సుకు ఎంపికైనవారు 13% వడ్డీతో సబ్సిడైజ్డ్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు.
వేతనం- కోర్సు పూర్తైన తర్వాత వార్షిక వేతనం రూ.4.12 లక్షలు
ఈ కోర్సుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.