హోమ్ /వార్తలు /jobs /

Axis Bank Jobs: యాక్సిస్ బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర... 4,000 పోస్టుల భర్తీ

Axis Bank Jobs: యాక్సిస్ బ్యాంక్‌లో ఉద్యోగాల జాతర... 4,000 పోస్టుల భర్తీ

Axis Bank Jobs | ఇప్పటికే 28,000 మందిని నియమించుకున్న యాక్సిస్ బ్యాంకు... త్వరలో మరో 4,000 పోస్టుల్ని భర్తీ చేయనుంది.

Axis Bank Jobs | ఇప్పటికే 28,000 మందిని నియమించుకున్న యాక్సిస్ బ్యాంకు... త్వరలో మరో 4,000 పోస్టుల్ని భర్తీ చేయనుంది.

Axis Bank Jobs | ఇప్పటికే 28,000 మందిని నియమించుకున్న యాక్సిస్ బ్యాంకు... త్వరలో మరో 4,000 పోస్టుల్ని భర్తీ చేయనుంది.

    ప్రైవేట్ రంగంలోని టాప్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్‌ 15,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిందన్న వార్తలు రెండు రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికే యాక్సిస్ బ్యాంకులో 28,000 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నట్టు తాజాగా వార్తలొస్తున్నాయి. అంతేకాదు... మరికొన్ని నెలల్లో మరో 4,000 మందిని నియమించుకోనుంది బ్యాంకు యాజమాన్యం. కొన్ని రోజులుగా యాక్సిస్ బ్యాంక్ నుంచి మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ ఉద్యోగులు భారీగా వెళ్లిపోతున్నారు. యాక్సిస్ బ్యాంకులో చాలాకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు అసౌకర్యంగా భావిస్తున్నారని, అందుకే వెళ్లిపోతున్నారన్న వాదన వినిపిస్తోంది. అందుకే కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో బ్యాంకుకు రాజీనామాలు చేస్తున్నారు ఉద్యోగులు. దీంతో ఆ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి.

    యాక్సిస్ బ్యాంకు నుంచి వెళ్లిపోయిన వారి సంఖ్య సుమారు 15,000 ఉంటుందని అంచనా. వారు వెళ్లిపోవడంతో ఏర్పడ ఖాళీలతో పాటు కొత్త ఉద్యోగాలను భర్తీ చేసింది బ్యాంకు. యాక్సిస్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ ఆపరేషనల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా ఈ పరిణామాలన్నీ జరిగాయి. ఇప్పటికే 28,000 మందిని నియమించుకున్న యాక్సిస్ బ్యాంకు... త్వరలో మరో 4,000 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందులో ఎక్కువగా సెమీ అర్బన్, టైర్ 2, టైర్ 3, గ్రామీణ ప్రాంతాల్లో నియమించనుంది. అంతేకాదు... రాబోయే రెండేళ్లలో 30,000 మంది ఉద్యోగుల్ని నియమించేందుకు ప్రణాళికలు చేస్తోంది యాక్సిస్ బ్యాంక్. వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు గతేడాది సెప్టెంబర్‌లో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్-QIP కోసం రూ.12,500 కోట్లను కేటాయించింది బ్యాంకు యాజమాన్యం.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి

    ఇవి కూడా చదవండి:

    Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో జాబ్స్... తెలంగాణలో 438, మొత్తం 6060 పోస్టులు

    Railway Jobs: రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 400 ఉద్యోగాలు... మొదలైన రిజిస్ట్రేషన్

    Telangana Jobs: ఇంటర్ పాసైనవారికి ఐఏఎఫ్‌లో జాబ్స్... సంగారెడ్డిలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ

    First published:

    ఉత్తమ కథలు