హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telanagana: తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ. 36 వేల కోట్ల పెట్టుబడులు.. ఏటా 48 వేల ఉద్యోగాలు..

Telanagana: తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ. 36 వేల కోట్ల పెట్టుబడులు.. ఏటా 48 వేల ఉద్యోగాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్ మహా నగరం మరో భారీ పెట్టుబడికి వేదికగా మారింది. 8 ఏండ్లలో రూ.36,300 కోట్ల పెట్టుబడులు హైదరాబాద్ కు రానున్నాయి. తద్వారా ఏటా సగటున 48 వేల మందికిపైగా ఉద్యోగాలు కల్పించనుంది అమెజాన్ వెబ్ సర్వీసెస్. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ మహా నగరం మరో సారి భారీ పెట్టుబడులకు వేదికగా మారింది. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌కు (Amazon) చెందిన వెబ్‌ సర్వీసెస్‌ (AWS) ఆసియా ఫసిఫిక్‌ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభమైంది. ఈ కేంద్రం వచ్చే 8 ఏండ్లలో రూ.36,300 కోట్ల పెట్టుబడులతో, ఏటా సగటున 48 వేల మందికిపైగా ఉద్యోగాలు కల్పించనుంది.  అమెజాన్​ వెబ్​ సర్వీసెస్​ డేటా సెంటర్ల ఏర్పాటుతో దేశ జీడీపీకి రూ. 63,600 కోట్లు యాడ్​ అవుతుందని తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (Minister KTR) ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సెంట‌ర్ ఏర్పాటుతో దేశంలోనే ప్ర‌గ‌తిశీల డేటా సెంట‌ర్ హ‌బ్‌గా తెలంగాణ స్థానాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని వివరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా అమెజాన్‌ డాటా సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సేవల ఉపాధ్యక్షుడు ప్రసాద్‌ కల్యాణరామన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ రీజియన్‌ ప్రారంభంతో డిజిటల్‌ ఇండియాకు పెద్ద ఎత్తున మద్దతు ఉంటుందని తెలిపారు. 2011లో తమ తొలి రీజియన్‌ను ముంబై కేంద్రంగా ప్రారంభించినట్లు చెప్పారు. అప్పటి నుంచి దేశంలో దీర్ఘకాలిక పెట్టుబడిలో ఇది ఒక భాగమని వివరించారు.

Minister KTR: తెలంగాణలోకి మరో 1,100 కోట్ల పెట్టుబడులు.. మరో 3,000 మందికి ఉద్యోగావకాశాలు.. వివరాలివే

డేటా అనలిటిక్స్‌, సెక్యూరిటీ, మెషిన్‌ లెర్నింగ్‌, కృత్రిమ మేధస్సు (AI)తో సహా వివిధ ఆవిష్కరణలను చేపట్టడానికి కస్టమర్లకు అధునాతన ఏడబ్ల్యూఎస్‌ టెక్నాలజీలకు యాక్సెస్‌ లభిస్తుందని ఆయన వివరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ శాఖల మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అమెజాన్‌ పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేశారు.

సరికొత్త టెక్నాలజీలు..

ఏడబ్ల్యూఎస్​ రెండో డేటా సెంటర్​ ఏర్పాటుతో డెవలపర్లు, స్టార్టప్స్​, ఎంట్రప్రెనూర్లు, ఎంటర్​ప్రైజస్​, ప్రభుత్వ​, ఎడ్యుకేషన్​, ఎన్​జీఓలకు తమ అప్లికేషన్లను రన్​ చేసుకోవడంలో ఛాయిస్​ పెరుగుతుందని అమెజాన్​ ఈ సందర్భంగా తెలిపింది. ఏడబ్ల్యూఎస్​ అడ్వాన్స్​డ్​ టెక్నాలజీలు ఇప్పుడు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఇందులో డేటా ఎనలిటిక్స్​, సెక్యూరిటీ, మెషిన్​ లెర్నింగ్​, ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (AI) వంటివి భాగమని వెల్లడించింది.

First published:

Tags: Amazon, Investments, JOBS, Minister ktr, Private Jobs

ఉత్తమ కథలు