Army School Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 టీచర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

AWES Recruitment 2019 | కంబైన్డ్ సెలెక్షన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది AWES. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.awesindia.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

news18-telugu
Updated: September 19, 2019, 12:33 PM IST
Army School Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 టీచర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
Army School Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 టీచర్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నారా? మంచి విద్యాసంస్థలో టీచర్ ఉద్యోగం చేయడం మీ కలా? ఆర్మీ వెల్‌‌ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో 8000 పైగా పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ పోస్టుల్ని  భర్తీ చేయబోతోంది. దేశంలోని మిలిటరీ స్టేషన్స్, కంటోన్మెంట్లల్లో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లల్లో ఈ పోస్టుల్ని నియమించనుంది. అయితే ఏఏ స్కూళ్లల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇంటర్వ్యూ నిర్వహించే ముందు ఆయా స్కూళ్లు వెల్లడిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 21 చివరి తేదీ. కంబైన్డ్ సెలెక్షన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది AWES. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్ పరిశీలన ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను www.awesindia.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 8000 పైగా టీచర్ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్‌‌ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ జారీ చేసిన జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

AWES Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన తేదీలు...



ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2019 సెప్టెంబర్ 1
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 సెప్టెంబర్ 21
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్: 2019 అక్టోబర్ 4 నుంచి
పరీక్ష నిర్వహించే తేదీ: 2019 అక్టోబర్ 19, 20
ఫలితాల విడుదల: 2019 అక్టోబర్ 30

AWES Recruitment 2019: విద్యార్హతలు, ఇతర వివరాలు


PGT: పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులతో పాస్ కావడంతో పాటు బీఈడీ ఉండాలి.
TGT: గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులతో పాస్ కావడంతో పాటు బీఈడీ ఉండాలి.
PRT: బీఈడీతో పాటు రెండేళ్ల డిప్లొమా 50% మార్కులతో పాస్ కావాలి.
వయస్సు: ఫ్రెషర్‌కు 40 ఏళ్లు, అనుభవజ్ఞులకు 57 ఏళ్లు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Honda Activa 125 BS6: కొత్త హోండా యాక్టీవా ఎలా ఉందో చూశారా?



ఇవి కూడా చదవండి:

RITES Jobs: రైల్వే సంస్థలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

LIC Jobs: ఎల్ఐసీలో 8500 అసిస్టెంట్ ఉద్యోగాలకు సిలబస్ ఇదే...
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading