హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Aviation Career: పైల‌ట్ అవ్వాల‌నుకొంటున్న వారికి సూప‌ర్ చాన్స్‌.. స్కాల‌ర్‌షిప్ అవ‌కాశం కూడా..

Aviation Career: పైల‌ట్ అవ్వాల‌నుకొంటున్న వారికి సూప‌ర్ చాన్స్‌.. స్కాల‌ర్‌షిప్ అవ‌కాశం కూడా..

Aviation Career | పైల‌ట్ అవ్వ‌ల‌కుంటున్న అమ్మాయిల‌కు "ఉమెన్ పైల‌ట్ అసోసియేష‌న్" Indian Women Pilots’ Association) మంచి అవ‌కాశం క‌ల్పిస్తోంది. దేశంలోని యువతులను ఏరోస్పేస్, ఏవియేషన్ రంగం ప‌ట్ల ఆస‌క్తిని పెంచ‌డానికి త‌మ వంతు కృషి చేస్తోంది ఈ సంస్థ‌. అందులో భాగంగా..

ఇంకా చదవండి ...

  పైల‌ట్ అవ్వ‌ల‌కుంటున్న అమ్మాయిల‌కు "ఉమెన్ పైల‌ట్ అసోసియేష‌న్"  Indian Women Pilots’ Association) మంచి అవ‌కాశం క‌ల్పిస్తోంది. దేశంలోని యువతులను ఏరోస్పేస్, ఏవియేషన్ రంగం ప‌ట్ల ఆస‌క్తిని పెంచ‌డానికి త‌మ వంతు కృషి చేస్తోంది ఈ సంస్థ‌. అందులో భాగంగా ఏవియేషన్ (Aviation), ఏరోస్పేస్‌పై మ‌హిళ‌ల‌కు అవగాహన కల్పించడానికి, వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందించడానిక, ఈ రంగంలో మ‌హిళ‌ల సంఖ్య‌ల‌ను పెంచ‌డానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో  17,726 పైలట్‌లు ఉంటే, వారిలో 15 శాతం   అంటే 2,764 మంది మహిళలు ఉండగా, ప్రపంచవ్యాప్తంగా, పైలట్‌లలో మహిళలు (Women) 5 శాతం ఉన్నారు. ఈ రంగంలో మ‌హిళ‌ల‌కు ప్రోత్స‌హించ‌డానికి ఈ సంస్థ గ‌త కొన్నేళ్లుగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మ‌హిళ‌లు పైల‌ట్లుగా త‌మ కేరిర్ ఎంచుకునే వారికి అన్ని విధాలా స‌హాయ స‌హాక‌రాలు అందిచ‌డానికి ముందుకొస్తోంది ఉమెన్ పైల‌ట్ అసోసియేష‌న్.

  TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ప‌రీక్ష తేదీల వివ‌రాలు

  ఈ రంగంలో శిక్ష‌ణ ఇవ్వ‌డంతోపాటు కోర్సు పూర్తి చేయ‌డానికి కావాల్సిన ఆర్ధిక స‌హాయాన్ని కూడా అందిచ‌డానికి ముందుకొస్తోంది ఈ సంస్థ‌. ఈ రంగంలో ఆస‌క్తి ఉన్నవారు త‌మ‌ను సంప్ర‌దిస్తే స‌రైన గైడెన్స్ తో పాటు కోర్స్ కు పూర్తి చేయడానికి కావాల్సి అన్ని సౌక‌ర్య‌లు క‌ల్సిస్తామ‌ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.  మన దేశంలో మహిళా పైలట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రపంచ సగటుతో పోల్చినప్పుడు ఇది ఎక్కువ మంది మహిళలు ఈ వృత్తిలోనికి రావ‌డానికి ఇంకా అవ‌కాశాలు ఉన్నాయి .

  నేడు మహిళలు ప్రతి రంగంలో పని చేయడం మనం చూడవచ్చు కానీ అది ఏవియేషన్ అండ్ ఏరోస్పేస్ విభాగాల్లో ఇంకా చాలా త‌క్కువ‌గానే ఉంద‌న్నారు ఐడబ్ల్యుపిఎ హైదరాబాద్ చాప్టర్ ఇన్‌చార్జి, కెప్టెన్ సప్నా పటేల్. ఇప్పటివరకు ఏవిమేష‌న్ విభాగాల్లో పని చేయ‌ని వారు కూడా ఐడబ్ల్యుపిఎలో చేరవచ్చుదీంతో వారు ఇప్ప‌టికే ఉన్న‌ సభ్యుల అనుభవం ద్వారా చాలా విష‌యాలు నేర్చుకుంటారు. ఈ రంగంలో ఆస‌క్తి వుంటే చాలు మీగ‌ది మొత్తం మేమే చూసుకుంటాం అంటున్నారు సంస్థ సభ్యులు.

  మహిళా పైలట్‌లను ప్రోత్సహించడానికి, IWPA అధునాతన శిక్షణ కోసం అర్హులైన వ్యక్తులకు స్కాలర్‌షిప్‌లు మరియు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఆస‌క్తి ఉన్నవారు స్కాల‌ర్ షిప్ ల కోసం https://www.iwpa.co.in/contact.php ద్వారా సంస్థ ప్ర‌తినిధుల‌ను సంప్ర‌దించోచ్చు.

  ఎలా సంప్ర‌దించాలి..

  - ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.iwpa.co.in/contact.php ను సంద‌ర్శించాలి.

  - అనంత‌రం ప్రాథ‌మిక స‌మాచారం అందించాలి.

  - త‌రువాత SEND MESSAGE ఆప్ష‌న్ క్లిక్ చేయ‌డం ద్వారా సంస్థ ప్ర‌తినిధుల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

  TS SSC Model Paper: టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. తెలుగు మోడల్ పేపర్ ఇదే.. ఓ లుక్కేయండి

  హైదరాబాద్ లో నాలుగు రోజుల పాటు సాగిన ఎయిర్ షో ‘వింగ్స్ ఇండియా 2022’ ఆదివారం బేగంపేట పాత విమానాశ్రయంలో ముగిసింది. భారతదేశంతో పాటు విదేశాల నుండి 125 మంది ఎగ్జిబిటర్లను ప్రదర్శించిన ఈ ఎయిర్ షో 5,000 మంది వ్యాపార ప్రతినిధులను, 60,000 మంది సాధారణ సందర్శకులు సందర్శించారు.

  - బాలకృష్ణ, హైదరాబాద్ బ్యూరో, న్యూస్ 18

  First published:

  Tags: Career and Courses, JOBS, Scholarship

  ఉత్తమ కథలు