Exam Results: ఆటోరిక్షావాలా కొడుకు... బోర్డ్ ఎగ్జామ్‌లో 99.98 పర్సెంటైల్‌తో పాస్

Exam Results | ఓ ఆటోరిక్షావాలా కొడుకు... బోర్డ్ ఎగ్జామ్‌లో 99.98 పర్సెంటైల్‌తో పాస్ అయ్యాడు. ఆ ప్రతిభావంతుడు ఎవరో తెలుసుకోండి.

news18-telugu
Updated: June 15, 2020, 11:59 AM IST
Exam Results: ఆటోరిక్షావాలా కొడుకు... బోర్డ్ ఎగ్జామ్‌లో 99.98 పర్సెంటైల్‌తో పాస్
Exam Results: రిక్షావాలా కొడుకు... బోర్డ్ ఎగ్జామ్‌లో 99.98 పర్సెంటైల్‌తో పాస్
  • Share this:
బాగా చదువుకోవడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాదని నిరూపించే ప్రతిభావంతులను మనం చూస్తూనే ఉంటాం. అలాంటివారిలో ఒకడు దీప్ హింగ్రాజియా. ఇతను ఆటోరిక్షావాలా కొడుకు. గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్-GSHSEB విడుదల చేసిన ఫలితాల్లో రికార్డు సృష్టించాడు ఈ కుర్రాడు. 12వ తరగతి జనరల్ స్ట్రీమ్ ఫలితాల్లో ఈ ఆటోరిక్షావాలా కొడుకు 99.98 పర్సెంటైల్‌తో పాస్ కావడం చర్చనీయాంశమైంది. దీప్ హింగ్రాజియా తండ్రి ఆటోరిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీప్ హింగ్రాజియా అప్పడాలు తయారు చేస్తుంటారు. అయినా దీప్ హింగ్రాజియాకు కుటుంబ ఆర్థిక పరిస్థితి అడ్డంకి కాలేదు. బాగా చదివాడు. 12వ తరగతి జనరల్ స్ట్రీమ్‌లో ఏకంగా 99.98 పర్సెంటైల్‌ తెచ్చుకొని రికార్డు సృష్టించాడు.

గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్-GSHSEB విడుదల చేసిన 12వ తరగతి జనరల్ స్ట్రీమ్ ఫలితాల్లో రాజ్‌కోట్ జిల్లాలో 79.14% మంది పాసయ్యారు. గతేడాది 79.59% మంది పాసయ్యారు. 108 మంది విద్యార్థులకు ఏ1 గ్రేడ్ వస్తే, 1551 మంది విద్యార్థులకు ఏ2 గ్రేడ్ వచ్చింది. ఆటోరిక్షావాలా కొడుకైన దీప్ హింగ్రాజియా 99.98 పర్సెంటైల్‌తో బోర్డ్ ఎగ్జామ్ ఫలితాల్లో రెండో స్థానంలో నిలవడం విశేషం. తాను సీఏ చదవాలనుకుంటున్నానని చెబుతున్నాడు దీప్ హింగ్రాజియా.

Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెంటనే తెలుసుకోవాలంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి

TS Inter Results 2020: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే...

Career Guidance: ఇంటర్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు... చేయొచ్చు ఇలా
Published by: Santhosh Kumar S
First published: June 15, 2020, 11:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading