హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2021: నీట్‌ ఎగ్జామ్ అటెంప్టింగ్ ట్రిక్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ.. బెంగళూరు టాపర్ ఇస్తున్న సూచనలివే!

NEET 2021: నీట్‌ ఎగ్జామ్ అటెంప్టింగ్ ట్రిక్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ.. బెంగళూరు టాపర్ ఇస్తున్న సూచనలివే!

అనిరుద్ధ దాస్

అనిరుద్ధ దాస్

పరీక్షకు నెలల ముందు దాస్ రోజుకు 14-16 గంటలు పాటు చదివాడు. అంతకు ముందు.. అతడు తరచుగా చిన్న బ్రేక్స్ తీసుకుంటూ రోజుకి 10 గంటలకు పైగా చదువుకున్నాడు. 11వ తరగతి నుంచే నీట్ ప్రిపరేషన్‌ ప్రారంభించాడు.

జాతీయ స్థాయి వైద్య విద్య పరీక్ష- నీట్ 2021(NEET 2021)లో ఉత్తీర్ణత సాధించడం మామూలు విషయం కాదు. అదీ తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులతో పాస్ కావాలంటే.. చక్కటి స్ట్రాటజీతో (NEET Preparation Strategy) ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే బెంగళూరుకు చెందిన అనిరుద్ధ దాస్ (19) వ్యూహాత్మకంగా సన్నద్ధమై ఫస్ట్ అటెంప్ట్‌లోనే నీట్‌(NEET)లో 99 పర్సంటైల్ మార్కులు సాధించి ఆశ్చర్యపరిచాడు. 720 మార్కులకు గాను అతడు 681 మార్కులు సాధించి 794 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అతను మెడికల్ కాలేజీ(Medical College)లో అడ్మిషన్ పొందడం కోసం నీట్ కౌన్సెలింగ్(NEET Counselling) ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో నీట్ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించడానికి ఎలా ప్రిపేర్ కావాలి? ఎలాంటి ట్రిక్స్ తెలుసుకోవాలి? ఎలాంటి స్ట్రాటజీ అనుసరించాలి? వంటి విషయాలను న్యూస్ 18తో పంచుకున్నాడు. "నీట్ ఎగ్జామ్ లో మంచి స్కోర్ సాధించాలంటే రోజూ కొంత సమయం పాటు చదవాలి. అంతేగానీ ఎగ్జామ్ సమీపిస్తున్న సమయంలో గంటల తరబడి చదివితే, ఏ ఉపయోగం ఉండదు." అని అనిరుద్ధ దాస్ చెబుతున్నాడు.

పరీక్షకు నెలల ముందు దాస్ రోజుకు 14-16 గంటలు పాటు చదివాడు. అంతకు ముందు.. అతడు తరచుగా చిన్న బ్రేక్స్ తీసుకుంటూ రోజుకి 10 గంటలకు పైగా చదువుకున్నాడు. 11వ తరగతి నుంచే నీట్ ప్రిపరేషన్‌ ప్రారంభించాడు. అప్పటినుంచి ఏ రోజు కూడా నీట్ ప్రిపరేషన్ ఆపలేదట. కాకపోతే విరామాలు తీసుకునేవాడట. అనిరుద్ధ దాస్ తాత ఈఎన్‌టీ (చెవి, ముక్కు, గొంతు) సర్జన్ గా పని చేస్తున్నారు. ఆయన కారణంగానే వైద్య వృత్తిని కెరీర్ గా తీసుకోవాలనే ఆసక్తి అనిరుద్ధలో పెరిగింది.

NEET Counselling 2021: ఫేక్ ఏజెంట్ల‌తో జాగ్ర‌త్త‌.. నీట్ కౌన్సెలింగ్‌పై ఎంసీసీ మార్గ‌ద‌ర్శ‌కాలు

“మా తాత తన కాలంలో ఫేమస్ ఈఎన్‌టీ సర్జన్ గా కొనసాగారు. ఆయన జాతీయ అవార్డు గ్రహీత కూడా. వైద్య వృత్తిపై నా ఆసక్తిని నిరంతరం పెంచే వ్యక్తి అతనే" అని అనిరుద్ధ చెప్పుకొచ్చాడు. తాత తర్వాత దాస్ ఒక్కడే తన కుటుంబంలో డాక్టర్ కాబోతున్నాడు. దాస్ తల్లి గృహిణి కాగా అతని తండ్రితో పాటు సోదరుడు ఇంజనీర్లుగా కొనసాగుతున్నారు.

Inspiration: కేవలం యూట్యూబ్ వీడియోలు, పుస్తకాలతో నీట్ క్వాలిఫై.. విద్యార్థినిని మెచ్చుకుంటూ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ ట్వీట్

"ఇండియాలో ప్రతి 1000 మందికి కేవలం 1.34 మంది వైద్యులు మాత్రమే ఉన్నారని నేను ఎక్కడో చదివి షాక్ అయ్యాను. ఆ క్షణమే నేను డాక్టర్‌ని కావాలని.. సమాజానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను.”అని అతను పేర్కొన్నాడు. సీఎంఆర్ నేషనల్ పబ్లిక్ స్కూల్‌లో 10వ తరగతి పూర్తి చేసిన దాస్ హెచ్ఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ తరగతి చదివి 95 శాతం సాధించాడు.

Career Guidance : నీట్ రాకున్నా.. వైద్య వృత్తిలో కొన‌సాగ‌వ‌చ్చు ఇలా

ప్రిపరేషన్‌ కోసం పుస్తకాలు

దాస్ ఫిజిక్స్ ప్రిపరేషన్‌ కోసం డీసీ పాండే ఆబ్జెక్టివ్ ఫిజిక్స్ వాల్యూమ్‌-1, వాల్యూమ్‌-2 చదివాడు. కెమిస్ట్రీ, బయాలజీ కోసం ‘ఎంటీజీ ఎన్సీఈఆర్టీ ఎట్ యువర్ ఫింగర్‌టిప్స్ (MTG NCERT at Your Fingertips)’ని ఉపయోగించాడు. ఎంటీజీ NEET/AIPMT ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్‌ను కూడా సాల్వ్ చేశాడు. ఈ క్వశ్చన్ బ్యాంక్‌ పుస్తకాన్ని మూడు సబ్జెక్టులకు ఉపయోగించాడు. పరీక్షకు కొన్ని నెలల ముందు ప్రతిరోజూ పేపర్‌లను రివైజ్ చేశాడు. అనిరుద్ధ ఆర్థోపెడిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ను అభ్యసించి, ఆర్థోపెడిక్ సర్జన్ కావాలనే దృఢనిశ్చయంతో ఉన్నాడు.

Neet 2021 Topper: నెట్‌ఫ్లిక్స్‌లో షోస్ చూస్తూ రోజుకు 4 గంటలే చదివాడు... నీట్‌లో 720/720 స్కోర్... ఇదెలా సాధ్యమైందంటే

ఎగ్జామ్ స్ట్రాటజీ

దాస్ మిగతా విద్యార్థులకు భిన్నంగా నీట్ పేపర్‌ను రివర్స్ ఆర్డర్‌లో అటెంప్ట్ చేశాడు. మొదట బయోలజీ తరువాత కెమిస్ట్రీ, చివరిగా ఫిజిక్స్ సాల్వ్ చేశాడు. బయాలజీలో 100 శాతం స్కోర్ చేయడం చాలా ఈజీ.. ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ అని.. అందుకే మొదటిగా దాన్నే అటెంప్ట్ చేశానని అనిరుద్ధ దాస్ చెబుతున్నాడు. దాస్ నీట్ 2021లో బయాలజీలో 360/360 స్కోర్ చేశాడు. అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీలో నూటికి నూరు శాతం స్కోర్ చేయడం చాలా కష్టంగా భావించాడు.

NEET Cheating Scam: నీట్‌-2021 స్కామ్‌లో 25 మంది విద్యార్థుల గుర్తింపు.. వారి ఫ‌లితాలు నిలివేయాల‌ని ఎన్‌టీఏను కోరిన పోలీసులు

ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీతో ప్రారంభించడం వల్ల మైండ్ త్వరగా అలసిపోతుందని.. ఫలితంగా వేగంగా ఆన్సర్లు ఇవ్వటం కష్టతరమవుతుందని అన్నాడు. OMR షీట్‌ను పూరించడానికి చాలా సమయం వెచ్చించాల్సి వస్తుందని.. ఇది మిమ్మల్ని తొందరపెడుతుందని.. చివర్లో బయాలజీలో తప్పులు చేసేలా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందని చెప్పుకొచ్చాడు. అందుకే తాను తన పేపర్‌ను రివర్స్ ఆర్డర్‌లో అటెంప్ట్ చేశానని వివరించాడు.

First published:

Tags: Exams, Medical college, NEET 2021