హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Scholarship: అటల్ బిహారీ వాజ్‌పేయి జనరల్ స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభం

Scholarship: అటల్ బిహారీ వాజ్‌పేయి జనరల్ స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభం

Scholarship: అటల్ బిహారీ వాజ్‌పేయి జనరల్ స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభం
(ప్రతీకాత్మక చిత్రం)

Scholarship: అటల్ బిహారీ వాజ్‌పేయి జనరల్ స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

Scholarship | అటల్ బిహారీ వాజ్‌పేయి జనరల్ స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్స్‌ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి, అర్హతలు గల విద్యార్థులు, ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఉన్నత చదువులు చదుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్న్‌ల్‌ అఫైర్స్‌, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి భారతీయ విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్‌లలో అటల్ బిహారీ వాజ్‌పేయీ జనరల్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ని (Atal Bihari Vajpayee General Scholarship) ప్రకటించింది. 2023-24 విద్యా సంవత్సరానికి సౌదీకి చెందిన విద్యార్థులకు 2 స్కాలర్‌షిప్ స్లాట్‌లను ICCR కేటాయించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌ ICCR, A2A స్కాలర్‌షిప్ పోర్టల్ http://a2ascholarships.iccr.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్‌ ప్రాసెస్‌ వివరాలు

అటల్ బిహారీ వాజ్‌పేయీ జనరల్ స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 30లోపు సమర్పించవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ICCR A2R పోర్టల్ ఇప్పుడు అభ్యర్థుల కోసం ఓపెన్‌ చేశారు. ఎంపికైన అభ్యర్థులకు తెలియజేయడానికి మే 31వ తేదీ వరకు యూనివర్సిటీలకు సమయం ఉంటుంది.

SSC Recruitment 2023: టెన్త్ పాసయ్యారా? 11,409 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయండిలా

వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇండియన్ మిషన్ అబ్రాడ్‌ ద్వారా స్కాలర్‌షిప్‌లను కేటాయించడానికి, ఆఫర్ లెటర్‌లను రూపొందించడానికి జూన్ 30ని గడువుగా పేర్కొన్నారు. అభ్యర్థులు ఆఫర్ లెటర్‌ను జులై 15లోపు అంగీకరించవచ్చు. మొదటి రౌండ్ తర్వాత సీట్లు అందుబాటులో ఉంటే, ఇండియ్‌ మిషన్స్‌ ఇతర విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించడానికి చివరి తేదీ జులై 22. అదే విధంగా సెకండ్ రౌండ్‌ అభ్యర్థులు జులై 30లోపు తమ అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.

అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు

A2A ప్రక్రియ ప్రకారం.. దరఖాస్తులు నేరుగా సంబంధిత విద్యార్థులు నేరుగా యూనివర్సిటీలకు పంపుతారు. మధ్యలో ఎలాంటి ప్రాసెస్‌ ఉండదు. ఇది ప్రక్రియను ఆటోమేట్ చేస్తుంది. విశ్వవిద్యాలయాలు విద్యార్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను నేరుగా చూడగలవు. ఇండియన్‌ యూనివర్సిటీలలో ఇంగ్లీషులో బోధిస్తున్నారు. కాబట్టి స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా ఇంగ్లీషు పరిజ్ఞానం ఉండాలి.

Powerful Resume: మీ రెజ్యూమ్ ఇలా ప్రిపేర్ చేస్తే జాబ్ గ్యారెంటీ

అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అదే విధంగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారులు 5 విశ్వవిద్యాలయాలు/ఇన్‌స్టిట్యూట్‌లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. తమకు నచ్చిన విధంగా ప్రయారిటీ ఇవ్వవచ్చు. విద్యార్థులు సూచించిన ప్రయారిటీ మేరకే అడ్మిషన్‌లు కల్పిస్తారు. ప్రాధాన్యం ఇచ్చిన యూనివర్సిటీలలో లిమిట్‌ సీట్‌లు మాత్రమే అందుబాటులో ఉంటే అడ్మిషన్‌ దొరకదు.

సిల్వర్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ (పీజీ, డాక్టరేట్ కోర్సుల కోసం), లతా మంగేష్కర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ స్కాలర్‌షిప్ స్కీమ్ కోసం స్కాలర్‌షిప్ పోర్టల్ ఫిబ్రవరి 20 నుంచి ఏప్రిల్ 30 వరకు ఓపెన్‌ చేయనున్నారు.

First published:

Tags: Career and Courses, JOBS, Scholarship

ఉత్తమ కథలు