Home /News /jobs /

ATA TECHNOLOGIES PLANS TO HIRE 3000 INNOVATORS IN NEXT 12 MONTHS UNDER TALENT ACQUISITION PROGRAMME GH VB

TATA Technologies: గుడ్ న్యూస్.. టాటా టెక్నాలజీస్ లో భారీగా నియామకాలు.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

. ప్రస్తుతం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కొత్త, అభివృద్ధి చెందుతున్న కస్టమర్‌ల అవసరాలు అనుగుణంగా మారుతున్నాయి. దీంతో టాటా టెక్నాలజీస్ కూడా ఇన్నొవేటర్లను తమ సంస్థలో చేర్చుకొని కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు సిద్ధమైంది.

ప్రముఖ గ్లోబల్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ టాటా టెక్నాలజీస్ (Tata Technologies) ఇన్నొవేటర్ల (innovators)కు తీపి కబురు అందించింది. తన టాలెంట్ అక్విజిషన్ ప్రోగ్రామ్ కింద వచ్చే 12 నెలల్లో 3,000 మందికి పైగా ఇన్నొవేటర్లను నియమించుకోనున్నట్లు (innovators hiring) టాటా టెక్నాలజీస్ ప్రకటించింది. అంతర్జాతీయంగా, భారతదేశంలోని మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడుతో సహా అన్ని ప్రధాన మార్కెట్లలో తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని తమ కంపెనీ యోచిస్తోందని టాటా టెక్నాలజీస్ ఒక ప్రకటనలో తెలిపింది. అటానమస్, కనెక్టెడ్, ఎలక్ట్రిఫికేషన్ అండ్ షేర్డ్ (ACES) మొబిలిటీ, డిజిటల్‌ రంగాల్లో ప్రస్తుతం టాటా టెక్నాలజీ సంస్థ అధికంగా పెట్టుబడులు పెడుతోంది.

ఈ నేపథ్యంలో ప్రతిభావంతులైన ఇన్నొవేటర్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందని కంపెనీ భావించింది. ప్రస్తుతం అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కొత్త, అభివృద్ధి చెందుతున్న కస్టమర్‌ల అవసరాలు అనుగుణంగా మారుతున్నాయి. దీంతో టాటా టెక్నాలజీస్ కూడా ఇన్నొవేటర్లను తమ సంస్థలో చేర్చుకొని కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు సిద్ధమైంది.

Padma Sri: జామియా మిలియా వర్సిటీ తొలి మహిళా వీసీకి పద్మశ్రీ.. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే..


"వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంజినీరింగ్ సేవల ఔట్‌సోర్సింగ్ (ESO) మార్కెట్‌ను శాసించేందుకు టాటా టెక్నాలజీస్ కంపెనీకి హెల్ప్ చేసే ఇన్నొవేటర్ల కోసం మేం ఎదురు చూస్తున్నాం," అని కంపెనీ పేర్కొంది. ఇందులో భాగంగా "మా టాలెంట్ అక్విజిషన్ ప్రోగ్రామ్ ను విస్తరించాం. ఇలా రాబోయే 12 నెలల్లో 3,000 పైగా ఇన్నొవేటర్లను నియమించుకోనున్నాం.'' అని కంపెనీ వివరించింది.

టాటా టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ వారెన్ హారిస్ మాట్లాడుతూ... ''మేం ఇన్నొవేటర్లకు పోటీసంస్థలకు సరిసమానంగా వేతనం అందిస్తాం. అలాగే గ్లోబల్ ప్రాజెక్ట్‌లలో పని చేయడానికి, నైపుణ్యాన్ని పెంచుకోవడానికి, తరగతి గది, గ్లోబల్ ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేర్చుకోవడానికి, 9,000కు పైగా గ్లోబల్ టాలెంటెడ్ వ్యక్తులతో సహకరించడానికి ఇన్నొవేటర్లకు వీలు కల్పిస్తాం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టాటా గ్రూప్‌లో భాగమయ్యే అధికారాన్ని కూడా అందిస్తున్నాం'' అని పేర్కొన్నారు. మెరుగైన ప్రపంచాన్ని ఇంజనీరింగ్ చేయాలనే ఒక విజన్ తో టాటా టెక్నాలజీస్... గ్లోబల్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్లు, వారి భాగస్వాముల పర్యావరణ వ్యవస్థను ఇంజనీర్ చేయడానికి, తయారు చేయడానికి, వినూత్నమైన, స్థిరమైన, పోటీతత్వంతో కూడిన మెరుగైన ఉత్పత్తులను రూపొందించడానికి వీలు కల్పిస్తుందని ఆయన తెలిపారు.

Women’s Shabarimala: ఈ టెంపుల్ మహిళల శబరిమల.. ఆడవాళ్లు ఇరుముడితో వెళ్లే ఈ ఆలయం ప్రత్యేకతలివే..


టాటా కంపెనీ #ComeJoinUs in #EngineeringABetterWorld అనే కొత్త బ్రాండ్ ప్రచారాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్నొవేటర్లను తమ కంపెనీలోకి ఆహ్వానిస్తోంది. కరోనావైరస్ విజృంభణ తర్వాత టెక్నాలజీతో కూడిన మార్పులలో పెట్టుబడులు వేగవంతమయ్యాయి. ఉత్పత్తులు ప్రాథమికంగా మారాయి. అలాగే బిజినెస్ మోడల్స్ అనేవి రీఇంజనీర్ అయ్యాయి. అంతేకాకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు రూపాంతరం చెందాయి. ఇలా డిజిటల్ అనేది ఓ జీవన విధానంగా మారిందని టాటా కంపెనీ తెలిపింది.
Published by:Veera Babu
First published:

Tags: CAREER, Career and Courses, IT jobs, Private Jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు