హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Asteroid: 7 ఏళ్ల బాలిక.. నాసా కోసం 7 గ్రహశకలాలు కనిపెట్టింది

Asteroid: 7 ఏళ్ల బాలిక.. నాసా కోసం 7 గ్రహశకలాలు కనిపెట్టింది

7 ఏళ్ల బాలిక.. నాసా కోసం 7 గ్రహశకలాలు కనిపెట్టింది (image credit - twitter)

7 ఏళ్ల బాలిక.. నాసా కోసం 7 గ్రహశకలాలు కనిపెట్టింది (image credit - twitter)

Asteroids: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారే... అలాగే ఆ చిన్నారి కూడా... రెండేళ్ల వయసు నుంతే... అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలపై ఆసక్తి చూపించింది. ఆ ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి.

  Asteroids: అంతరిక్షం అద్భుతంగా ఉంటుంది. రాత్రైతే నక్షత్రాలు, గ్రహాలూ కనిపిస్తూ... దమ్ముంటే లెక్కపెట్టమని సవాల్ విసురుతాయి. ఇప్పుడైతే... నాలుగు రోజులుగా... చందమామ పక్కనే అత్యంత కాంతివంతంగా మెరుస్తూ గురుగ్రహం (Jupiter) కనిపిస్తోంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో అది నడి నెత్తిపై పెద్ద వజ్రంలా మెరుస్తూ కనిపిస్తోంది. సరే.. మనం చిన్నారి మ్యాటర్ లోకి వద్దాం. ఏడేళ్ల ఆ పాప పేరు నికోల్ ఒలివిరా (Nicole Oliviera). దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌కి చెందినది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా (NASA) కోసం 7 గ్రహశకలాల్ని కనిపెట్టి.. చిన్న వయసులోనే అంతరిక్ష పరిశోధకురాలిగా మారింది. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొల్లాబరేషన్... ఆమధ్య ఆస్టరాయిడ్ హంట్ (Asteroid Hunt) అనే కార్యక్రమం ప్రారంభించింది. ఇదే సిటిజన్ సైన్స్ ప్రోగ్రాం. ఇందులో ప్రజలు పాల్గొనవచ్చు. ఇందులో నాసాకి సభ్యత్వం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారి 7 గ్రహశకలాల్ని గుర్తించి... నాసాకు సాయం చేసింది. ఇందుకోసం సర్టిఫికెట్ కూడా పొందింది.

  చిన్నప్పుడు పిల్లలు రకరకాల బొమ్మలు అడుగుతారు. ఈ పిల్ల మాత్రం అవేవీ అడగలేదు. నీకు ఏం కావాలో చెప్పు చిట్టితల్లీ అంటే... ఆకాశంలో నక్షత్రాన్ని చూపించి... అది కావాలని అడిగిందట. దాంతో వాళ్లమ్మ... ఓ నక్షత్రం బొమ్మ కొని ఇచ్చింది. దాంతో ఆ చిన్నారికి ఏం కావాలో ఆ తల్లికి అర్థమైపోయింది. ఇప్పుడీ పాప... చాలా స్కూళ్లలో ఆస్ట్రానమీ (astronomy)పై లెక్చర్లు ఇస్తోంది. బ్రెజిల్ ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ... ఆమెను పిలిపించి... తమ దేశంలో జరిగిన మొదటి ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ అండ్ ఏరోనాటిక్స్ సెమినార్‌లో లెక్చర్ ఇప్పించింది.

  ప్రస్తుతం ఈ చిన్నారి తన లెక్చర్లన్నీ ఆన్‌లైన్‌లో ఇచ్చేస్తోంది. నికోలాకి ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో రోదసిపై అవగాహన వీడియోలు పెడుతూ ఉంటుంది. అలాగే గ్రహశకలాలు (Asteroids), అంతరిక్షం, నక్షత్రాల గురించి చెబుతుంది. అంతేకాదు.. ఖగోళ శాస్త్రంలో తలపండిన శాస్త్రవేత్తలతో మాట్లాడి... వారి నుంచి లెక్చర్లు తీసుకుంటుంది. ఇలా అన్నీ రోదసికి సంబంధించినవే చేస్తుంది.

  తెలుగమ్మాయి కూడా:

  ఆంధ్రప్రదేశ్... పశ్చిమ గోదావరి జిల్లా... నిడదవోలులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల కుంచల కైవల్యారెడ్డి కూడా గతేడాది ఓ గ్రహశకలాన్ని కనిపెట్టింది. ఇందుకోసం ఆమెకు ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ రీసెర్చ్ కొల్లాబరేషన్ (IASC) సంస్థ నుంచి ఓ సర్టిఫికెట్ వచ్చింది. ఆమె హవాయ్ లోని పాన్ స్టార్స్ (PAN STARRS) టెలిస్కోప్ తీసిన అంతరిక్షం ఫొటోలను లోతుగా పరిశీలించింది. మార్స్ (Mars), గురుగ్రహం (Jupiter) మధ్య తిరిగే ఓ గ్రహశకలాన్ని గుర్తించింది. ఇలా గుర్తించడం మామూలు వాళ్లకు కష్టం. ఇందుకు ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ బాలిక ఢిల్లీకి చెందిన స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంది. తద్వారా గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు, తోకచుక్కలు, గ్రహశకలాల్ని గుర్తించడం నేర్చుకుంది.

  గ్రహశకలాల అన్వేషణ:

  మీరు కూడా గ్రహశకలాల్ని వెతకొచ్చు. ఇందుకోసం నాసా తీసిన ఒరిజినల్ (Raw) ఫొటోలను అందుబాటులో ఉంచింది. అవి వేర్వేరు గ్రహాలు, ఉప గ్రహాల దగ్గర తీసినవి. కొన్ని ఫొటోల్లో మీరు గ్రహ శకలాల్ని గుర్తించవచ్చు. అందుకు లింక్ ఇదే... https://solarsystem.nasa.gov/raw-images/raw-image-viewer/?order=earth_date+desc&per_page=50&page=0

  ఇది కూడా చదవండి: Gympie: శపించే మొక్క!... ఆకుల్ని ముట్టుకుంటే ఆత్మహత్యే!

  మీరు ట్రైనింగ్ తీసుకోకపోయినా... అలాంటి అంతరిక్ష ఫొటోలను చూడొచ్చు. అందుకు ఈ లింక్ క్లిక్ చెయ్యండి. https://hubblesite.org/resource-gallery/images ఈ లింకులో ఉన్నవి పాన్ స్టార్స్ టెలిస్కోప్ తీసిన ఫొటోలే. మరిన్ని ఫొటోలు చూడాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చెయ్యండి. https://hubblesite.org/images/gallery వీటి ద్వారా మీరు కూడా అంతరిక్ష పరిశోధకులు అయిపోతారు. ఏమో మీరే ఏదో ఒక రోజు ఓ కొత్త గ్రహాన్ని కనిపెడతారేమో... ఎవరికి తెలుసు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Asteroid, Earth, NASA

  ఉత్తమ కథలు