Home /News /jobs /

ASPIRANTS SHOULD TRY THEIR BEST NOT TO LET DESPAIR AND DEPRESSION GET IN THE WAY SAYS CHIEF ELECTORAL OFFICER OF THE TELANGANA STATE PARTHASARATHY VB ADB

Competitive Exams: ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.. ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేధించాలి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి

మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్థసారథి

మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్థసారథి

పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపుతూ, పరీక్షలపై ఉన్న భయాలు, అపోహలను తొలగించేందుకు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్థసారథి ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. 

  (కట్టా లెనిన్, ఆదిలాబాద్ ప్రతినిధి, న్యూస్ 18)

  యువత నిరాశ(Disappointment), నిస్పృహలను దరిచేరనివ్వకుండా గట్టి సంకల్పంతో ప్రయత్నించాలని, ఆ ప్రయత్నానికి ఏకాగ్రత(Concentration) తోడైతే ఆశించిన లక్ష్యాన్ని సునాయసంగా చేధించవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. పార్థసారథి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కేంద్రంలోని జిల్లా పరిషత్(Parishath) సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. ఉద్యోగ సాధనలో భాగంగా నిరుద్యోగ అభ్యర్థులు పాటించాల్సిన మెళకువలను అర్ధవంతంగా, ఆకట్టుకునే రీతిలో వివరిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేశారు. తన స్వీయ అనుభవాలను జోడించి పలు అంశాల పట్ల అవగాహన కల్పించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు.

  DOST Notification 2022: దోస్త్(DOST) నోటిఫికేషన్ విడుదల.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి..


  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు అంశాలపై అవగాహన కల్పించారు. గతంతో పోలిస్తే ఈసారి అభ్యర్థులకు అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని సద్వినియోగం చేసుకొని కొలువులు దక్కేలా కృషి చేయాలని సూచించారు. తమపై తాము గట్టి నమ్మకంతో కష్టపడ్డపుడే విజేతలవుతారని పేర్కొన్నారు. కొన్ని సాధించడానికి కొన్ని త్యాగం చేయక తప్పదని పేర్కొన్నారు. యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ, మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకుసాగాలని సూచించారు. పోటీ పరీక్షలంటే భయం, అపోహలు ఎక్కువ అని, వాటితోపాటు వాయిదా వేయడం, బద్దకం, అత్మన్యూనత భావం, మొహమాటం విడిచిపెట్టాలని, తమపై తాము నమ్మకం పెంచుకోవాలని సూచించారు. పరీక్షలో ప్రతీ ప్రశ్న, ప్రతీ మార్కు కీలకమన్నారు.

  ఇదీ చదవండి: జాయింట్‌ హోమ్‌ లోన్‌ తీసుకుంటున్నారా..? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..


  ఏకాగ్రత, స్థిరత్వంతో విషయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ పరీక్షలకు సిద్దంకావాలని అన్నారు. ఆత్మన్యూనతకు లోను కావద్దని, నమ్మకంతో ఉద్యోగ సాధన దిశగా అడుగులు వేయాలని సూచించారు. అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ సమయం వృధా చేయకుండ, తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడపైనే యువత దృష్టి సారించాలని బోధించారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం, శక్తిసామర్ధ్యం ఉంటుందని, తమ మీద తాము నమ్మకం ఉంచి కష్టపడ్డవారే విజయం సాధిస్తారని తెలిపారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం నుండి వస్తున్న నోటిఫికేషన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఇదో సువర్ణావకాశమని, ఇలాంటి అవకాశం మళ్లీ రాకపోవచ్చని పేర్కొన్నారు. త్వరలో రాష్టంలో ఉద్యోగ విప్లవం రానుందని, ఇప్పటికే గ్రూప్ 1, ఎస్.ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వచ్చాయని, త్వరలోనే గ్రూప్ 2, 4 ఇతర ఉద్యోగ ప్రకటనలు కూడా రానున్నాయని వివరించారు. గ్రూప్ 1 కు సంబంధించి ప్రిలిమినరి, మేయిన్స్ లో అడిగే ప్రశ్నలు, అందుకోసం అభ్యర్థులు ఎలా చదవాలో విశ్లేషణాత్మకంగా వివరించారు. బట్టి పద్దతిన కాకుండా సమగ్రంగా అధ్యయనం చేయాలని, చదివిన అంశాలను అర్ధం చేసుకొని, అవగాహన చేసుకోవాలన్నారు. అభ్యర్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు. పక్కా ప్రణాళికతో సంసిద్దులవుతే ఉద్యోగం సాధించడం కష్టతరమేమి కాదని, ఏకాగ్రతతో చదివి యువతీ యువకులు తాము కోరుకున్న కొలువును దక్కించుకొని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

  ఇది చదవండి: రాష్ట్రాన్ని తగలబెడుతుంటే అడ్డుకున్నా.. అందుకే ఇదంతా..!


  అంతకుముందు జిల్లా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగ యువ ఇది ఒక మంచి అవకాశం అన్నారు. వివిధ ఉద్యోగాలకు సిద్దమవుతున్న జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్సి, బిసి, మైనారిటి స్టడీ సర్కిళ్ల ద్వార ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు స్టడి మెటిరియల్ కూడా అందజేస్తుమన్నారు. వీటిని సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఎస్.పి ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్.ఐ. కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు చూపిన ఉత్సాహాన్ని పరీక్ష పూర్తి చేసే వరకు కొనసాగించాలని, నిరంతరం అభ్యాసం కొనసాగించాలని అన్నారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ నిరుద్యోగ అభ్యర్థులు ఒక ప్రణాళికను రూపొందించుకొని, దానికనుగుణంగా సాధన చేయాలని అన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏమి లేదన్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Adilabad, Career and Courses, JOBS

  తదుపరి వార్తలు