హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET PG: నీట్ పీజీ కౌన్సెలింగ్ రౌండ్-1 సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ రద్దు.. జీవితాలతో ఆడుకోవద్దని అభ్యర్ధుల ఆవేదన!

NEET PG: నీట్ పీజీ కౌన్సెలింగ్ రౌండ్-1 సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్ రద్దు.. జీవితాలతో ఆడుకోవద్దని అభ్యర్ధుల ఆవేదన!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET PG: తాజాగా ముగిసిన నీట్ పీజీ కౌన్సెలింగ్ సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్‌ను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC). ఈ ఫలితాలను కమిటీ సెప్టెంబర్ 27న అప్‌లోడ్ చేయగా, వీటిని విత్‌డ్రా చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. దీంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

పీజీ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) PG రిజల్ట్స్ ఇటీవల విడుదలయ్యాయి. అడ్మిషన్స్ కోసం కౌన్సెలింగ్ (Counselling) ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే తాజాగా ముగిసిన నీట్ పీజీ కౌన్సెలింగ్ సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్‌ను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC). ఈ ఫలితాలను కమిటీ సెప్టెంబర్ 27న అప్‌లోడ్ చేయగా, వీటిని విత్‌డ్రా చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. దీంతోపాటు మరోసారి ఛాయిస్ ఫిల్లింగ్ రౌండ్‌ను ఓపెన్ చేసింది. అయితే ఎంసీసీ నిర్ణయంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ జీవితాలతో ఆడుకోవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై నీట్ పీజీ అభ్యర్థులు కొందరు తీవ్రంగా స్పందిస్తున్నారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఇప్పటికే ఆలస్యమైందని, అసలు ఎందుకు ఇలా నిరంతరం ప్రాసెస్‌ను వాయిదా వేస్తున్నారని ఒక అభ్యర్థి ప్రశ్నించారు. ఈ గందరగోళం ఏంటని సోషల్ మీడియాలో ఎంసీసీని టార్గెట్ చేస్తూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎంసీసీ నిర్ణయం పెద్ద క్రూయెల్ జోక్‌గా ఉందంటూ ట్విట్టర్‌ యూజర్లు పోస్టులు పెడుతున్నారు. వారికి విద్యార్థుల సమయం, క్షేమం గురించి ఎటువంటి ఆందోళన లేదని వాపోతున్నారు.

* కారణం ఏంటి?

కొన్ని PG DNB ఇన్‌స్టిట్యూట్‌లు పోర్టల్‌లో అడ్రస్ ప్రొఫైల్‌ను పూర్తి చేయనందువల్ల ప్రస్తుత సమస్య తలెత్తిందని ఎంసీసీ చెబుతోంది. ఈ కారణంగా ఛాయిస్ ఫిల్లింగ్ టైమ్‌లో 'స్టేట్ ఫిల్టర్'ను యూజ్ చేసిన అభ్యర్థులకు కొన్ని సీట్లు కనిపించలేదని పేర్కొంది. రౌండ్-1 సీట్ మ్యాట్రిక్స్‌లో సీట్లు ఉన్నా, అడ్రస్‌ సరిగా లేకపోవడంతో ఛాయిస్ ఫిల్లింగ్ సమయంలో కనిపించలేదని పేర్కొంది. MCC ఇప్పుడు ఛాయిస్ ఫిల్లింగ్‌ రౌండ్‌ను మళ్లీ ఓపెన్ చేసింది. రౌండ్ 1 ఫ్రెష్ రిజల్ట్‌ను మళ్లీ విడుదల చేయనుంది.

* ఇప్పుడేం చేయాలి?

ఇప్పటికే ఇచ్చిన ఆప్షన్లతో సంతృప్తి చెందిన అభ్యర్థులు ఎలాంటి మార్పులు చేయనవసరం లేదని, సీట్ ప్రాసెసింగ్ కోసం అభ్యర్థులు ముందుగా లాక్ చేసిన అభ్యర్థి ఆప్షన్లను సాఫ్ట్‌వేర్ ఎంచుకుంటుందని ఎంసీసీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. తమ ఆప్షన్లలో మార్పులు చేసుకోవాలనుకునే అభ్యర్థులు MCC పోర్టల్‌లో సమ్మతి ఇచ్చిన తర్వాత అన్‌ఫ్రీజ్ చేయవచ్చు. పీజీ కౌన్సెలింగ్ రౌండ్ 1 కోసం ఆప్షన్ ఫిల్లింగ్ ప్రారంభమైంది.

ఇది కూడా చదవండి : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. 5160 ఉద్యోగాల తక్షణ భర్తీకి సీఎం జగన్ ఆదేశాలు.. పూర్తి వివరాలివే

సెప్టెంబర్ 30 రాత్రి 8 గంటల వరకు ప్రాసెస్ కొనసాగుతుంది. ప్రొవిజనల్, ఫైనల్ రిజల్ట్ అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 30న ఉంటుంది. రౌండ్ 1 రిపోర్టింగ్ అక్టోబర్ 1 నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. తాజా అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు MCC వెబ్‌సైట్‌ ఫాలో అవ్వాలని, ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ తర్వాతనే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని వెబ్‌సైట్ నోట్ పేర్కొంది.

* అభ్యర్థుల డిమాండ్‌కు స్పందన శూన్యం

నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని గతంలో అభ్యర్థులు డిమాండ్ చేశారు. కానీ MCC మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ నిర్వహించింది. ‘నీట్ పీజీ కౌన్సెలింగ్ ఆలస్యమైంది, ఛాయిస్ ఫిల్లింగ్ ఆలస్యమైంది, ప్రొవిజనల్ అలాట్‌మెంట్ క్యాన్సిల్ అయింది. అడ్మిషన్ విషయం దేవుడికే తెలుసు. కానీ నీట్ పీజీ పరీక్షను కేవలం 3 వారాల పాటు వాయిదా వేయాలని మేము కోరినప్పుడు మాత్రం హెల్త్ కేర్ విషయంలో రాజీపడలేమని గొప్పలు చెప్పారు’ అని ఒక నీట్ పీజీ అభ్యర్థి ట్వీట్ చేశారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Career and Courses, EDUCATION, JOBS, NEET

ఉత్తమ కథలు