Home /News /jobs /

ASPIRANTS FOR CONSTABLE JOBS CAN QUALIFY IN PRELIMS AS WELL AS MAINS IF THEY PREPARE AS MENTIONED BELOW KNR VB

Constable Preparation Tips: కానిస్టేబుల్ కొలువే మీ లక్ష్యమా.. ఈ టిప్స్ పాటిస్తే మీ కల నెరవేరినట్లే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టిప్స్..

    (P. Srinivas, News 18, Karimnagar) 

    కానిస్టేబుల్ జాబ్స్ కు ప్రిపేర్(Preparation) అవుతున్న అభ్యర్థులకు వచ్చే నెల 21న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్(Prelims Exams) ఉండబోతుంది . ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి.. ? ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు ఐతే.. ఇప్పుడు ఉన్న టైం లో చదవడం అనేది మరొక ఎత్తు. మరి కాన్స్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్(Prelims Exams) ఎలా చదవాలి అనే అంశలపై విన్నర్ పబ్లికేషన్స్ సీనియర్ ఫ్యాకల్టీ అల్లం సాయికృష్ణ సార్ సూచనలు సలహాలు ఏంటో ఒకసారి చూద్దాం.. కానిస్టేబుల్ కు ప్రిపేర్ ఐయ్యే అభ్యర్థుల కు ముందుగా ప్రిలిమ్స్(Prelims), తరువాత ఈవెంట్స్, ఇవి క్వాలిఫై ఐతే మెయిన్స్ ఉంటాయి. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ టోటల్ 200 మార్కులకు(Marks) ఎగ్జామ్స్(Exams) ఉంటుంది.

    SI Prelims Preparation: ఎస్ఐ ప్రిలిమ్స్ లో నెగెటివ్ మార్కులు ఉన్నా.. ఇలా ప్రపేర్ అయితే అర్హత సాధించొచ్చు..


    అర్థమెటిక్, రీజనింగ్ కలిపి 50 మార్కులు, ఇంగ్లీష్ 20మార్కులు ఉంటాయి. ఇంకా 130 మార్కులు, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి 130 మార్కులు ఉంటాయి. ఇందులో 60మార్కులు వస్తే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి 60మార్కులు రావాలంటే 5తప్పులకు ఒక నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ఈసారి ఇది జాగ్రత్త గా చూసి ఆన్సర్ చేస్తేనే 60 మార్కులు సాధించవచ్చు . అప్పుడే ప్రిలిమ్స్ లో మనము విజయం సాధించినవారము అవుతామన్నారు. క్లాస్ రూంలో విన్న నోట్స్, మాక్ టెస్ట్ లు ఎవరైతే రాస్తారో వాళ్లు మంచి స్కోరింగ్ చేసుకోడానికి అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.



    గతంలో కూడా సేమ్ ఇలానే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఉండేవి. కానీ ఈ సారి అర్హతలో మార్పు వచ్చింది. 60 మార్కులే కదా అని చాల మంది లైట్ గా తీసికుంటే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గత ఎగ్జామ్స్ ను గుర్తుపెట్టుకొని పాత మోడల్ పేపర్స్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని సన్నద్ధం కావాలి.. ఈసారి కంపిటేషన్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ చాల కఠినంగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి.. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు.  పరీక్షకు చాలా తక్కువ సమయం ఉంది.. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రివైస్డ్ అనేది చాలా ముఖ్యమైన అంశం. వారానికి ఒక పుస్తకం చదవాలి అనేది కాకుండా.. ఇన్ని రోజులు చదివిన ప్రతి సబ్జెక్టు ఒక్కసారి రివైస్డ్ చేసుకుంటే సరిపోతుంది.

    Singareni Vacancies: గుడ్ న్యూస్.. సింగరేణిలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ.. 1300 పోస్టులు ఖాళీ..


    అలాగే గత ప్రిలిమ్స్ మోడల్ పేపర్లను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏ రకంగా పరీక్షకు సిద్ధం కావాలో తెలుస్తుందని అన్నారు. అలాగే పరీక్ష హాల్లోకి వెళ్ళగానే ప్రశ్నాపత్రం ఇవ్వగానే ఒకటికి రెండుసార్లు చదివి ఆన్సర్లను గుర్తించినట్లయితే మనం అనుకున్న దానికంటే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉందని విన్నర్ పబ్లికేషన్ సీనియర్ ఫ్యాకల్టీ సాయి కృష్ణ సార్ అంటున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: CAREER, Career and Courses, JOBS, Preparation, Telangana jobs, Ts constable

    తదుపరి వార్తలు